Share News

దుమ్మెత్తిపోతోంది!

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:39 AM

రాజమహేంద్రవరం- మల్లయ్యపేట పెట్రోల్‌ బంక్‌ రోడ్డు పరిస్థితి దుమ్ము, ధూళితో నానాటికి దారుణంగా మారుతోంది. కోటిలింగాల ఇసుక ర్యాంప్‌ల నుంచి వచ్చే భారీ లారీ

దుమ్మెత్తిపోతోంది!

దారుణంగా రాజమహేంద్రవరం - మల్లయ్యపేట పెట్రోల్‌ బంక్‌ రోడ్డు ప్రజలకు అవస్థలు

రాజమహేంద్రవరం- మల్లయ్యపేట పెట్రోల్‌ బంక్‌ రోడ్డు పరిస్థితి దుమ్ము, ధూళితో నానాటికి దారుణంగా మారుతోంది. కోటిలింగాల ఇసుక ర్యాంప్‌ల నుంచి వచ్చే భారీ లారీల దెబ్బకు తారు రోడ్డు కాస్తా మట్టి, ఇసుక పర్రలా మారిపోతోంది. ద్విచక్రవాహనదారులు ఇసుక దారిలో జారి పడి గాయాలపాలవుతు న్నారు. ఆర్టీసీ, ప్రవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఈ రోడ్డుగుండానే ఎ క్కువగా వెళ్తుంటాయి. ఇసుక లోడు లారీలు ఫుల్‌గా లోడ్‌ వేసుకుని వస్తూ దారిలో ఇసుకను వేస్తున్నాయి. అది రోడ్డు పై ఇతర వాహనాల కింద నలిగి మట్టిగా మారిపోయి రోడ్డం తా దుమ్ముతో నిండిపోతోంది. ఈ దుమ్ము వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది. రోజు రోడ్డు పక్క న ఉన్న వ్యాపారస్తులు, గృహాల్లో ఉండేవారు ఉదయం, సాయం త్రం బాకెట్లతో మట్టిని ఎత్తుకుని పారబోసే పరిస్థితి ఉంది. ద్విచక్రవాహనదారులు దుమ్ములో ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. రోడ్డులో దుమ్ము, ఇసుక కళ్లల్లో పడి అవస్థలు పడుతున్నామని, రెప్పపాటులో ప్రమాదాలు జరిగే అవకాశంఉందని భయాందోళన చెందుతున్నారు.

రాజమహేంద్రవరం సిటీ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 09 , 2025 | 12:39 AM