రాజమహేంద్రవరం జీజీహెచ్ అభివృద్ధికి దాతలు ముందుకురావాలి : ఎంపీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:50 AM
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధికి దాతలు మరింతమంది ముందుకురావాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు గెయిల్ సమకూర్చిన అధునాతన వైద్యప
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధికి దాతలు మరింతమంది ముందుకురావాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు గెయిల్ సమకూర్చిన అధునాతన వైద్యపరికరాలను ఆసుపత్రి అధికారులకు అందజేసే కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా ఎంపీ మాట్లాడుతూ బోధనాసుపత్రి ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని, దాతలు సహకరిస్తే ఎక్కువ మందికి సహాయం అందించే అవకాశం ఉంటుందన్నారు. జీజీహెచ్‌లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో లేవని వైద్యులు, సిబ్బంది కొరత ఉందని చెప్తున్నారని, ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఏ ఒక్కరినీ కాకినాడ రిఫర్ చేసే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రి ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, డిప్యుటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణంరాజు, ఆర్‌ఎంవో సుబ్బారావు పాల్గొన్నారు.