రవాణా వాహనాల ఫిట్‌నెస్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:17 AM
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 28( ఆంధ్ర జ్యోతి): రవాణా వాహనాల ఫిట్‌నెస్ (బ్రేక్) రవాణా శాఖ అధికారుల నుంచి ప్రైవేట్ సం స్థలకు కూటమి ప్రభుత్వం అప్పజెప్పడం వల్ల రవాణా కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పంది రి హాలులో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమాశంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని
జూలై 1న ‘చలో రాజానగరం’ విజయంతం చేయాలని అఖిల పక్ష నేతల పిలుపు
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 28( ఆంధ్ర జ్యోతి): రవాణా వాహనాల ఫిట్‌నెస్ (బ్రేక్) రవాణా శాఖ అధికారుల నుంచి ప్రైవేట్ సం స్థలకు కూటమి ప్రభుత్వం అప్పజెప్పడం వల్ల రవాణా కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పంది రి హాలులో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమాశంలో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరత్‌రామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడచినా రవాణా రంగ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. రవాణా కార్మికులకు ఈ ఫిట్‌నెస్ విధా నం వల్ల బాధ ఉన్నందువల్లే ఇంతమంది వచ్చారని త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం ప్ర భుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నట్టు ఉండ వల్లి అన్నారు. రవాణా కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ఏపీలో ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళ న చేయడానికి అందరూ సంసిద్ధం కావాలని మార్గాని పిలుపునిచ్చారు. కన్వీనర్లు వాసంశెట్టి గంగాధర్, బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ తరపున తాము ఈ ఆందోళన చేపట్టడం లేదని, అందర్ని కలిపి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని ప్రారంభించామ న్నారు. జూలై1న నిర్వహించే చలో రాజానగరం విజయవంతం చేయాలని తీర్మానించారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడితే చలో రాజానగరం కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో ఏజీటీయూసీ నాయకుడు రెడ్డి రమణ, వైసీపీ నాయకులు వైకేఎల్, కేఎల్ నరసింహరెడ్డి, డీవీ రెడ్డి, ఐఎన్‌టీయూసీ ఉభయరాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.నారాయణరావు, ముచ్చకర్ల సత్యనారాయణ, పొలేపల్లి నాగేశ్వరరావు, ఆదినారాయణ, డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.