Share News

మేఘాలలో..తేలిపోదాం!

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:10 AM

ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే ప్రయాణికులకు చుక్కలు చూపించారు.. అమ్మో విమాన ప్రయాణం ఇంత కష్టమా అనుకునేలా చేశారు..

మేఘాలలో..తేలిపోదాం!

ఇప్పటి వరకూ 11 విమానాలు

4,5 తేదీల్లో తీవ్ర సంక్షోభం

7కు కుదించిన ఇండిగో సంస్థ

వాటిలో నాలుగు ఎయిర్‌బస్‌లు

రేపటి నుంచి కొత్త షెడ్యూల్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఎగిరిపోతే ఎంత బాగుంటుందో.. అనుకునే ప్రయాణికులకు చుక్కలు చూపించారు.. అమ్మో విమాన ప్రయాణం ఇంత కష్టమా అనుకునేలా చేశారు.. ఇండిగో సంక్షోభం కారణంగా ఈ నెల 4,5 తేదీల్లో విమానం ఎప్పుడొస్తుందోనని ప్రయాణికులు ఆకాశం వైపు ఎదురుచూపులు చూశారు.. ఒక విమానం కోసం 160 మంది ప్రయాణికులు 9 గంటల పాటు విమానాశ్రయంలోనే ఎదురుచూశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం విమాన ప్రయాణం కుదుటపడినా.. ప్రయాణికులు మాత్రం కుదురుకోలేదు.. మరో వైపు ఇండిగో సంస్థ విమానాలు తగ్గించి 4 ఎయిర్‌బస్‌లు అందుబాటులోకి తేనుంది. ఇంకెందుకు ఆలస్యం మేఘాలలో తేలిపోదాం రండి మరి..

ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభవం దారిన పడినట్టు చెబుతున్నారే కానీ రాజ మండ్రి ఎయిర్‌పోర్టు నుంచి రెగ్యులర్‌గా తిరిగే ఏడు విమానాలను నిలిపివేసి వాటి స్థానంలో కొత్తగా నాలుగు ఎయిర్‌ బస్సులను నడపను న్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ కొత్త షెడ్యూల్‌ ప్రకటించారు. జనవరి 1 నుంచి షెడ్యూల్‌ మారుతుందా.. విమానాల సంఖ్య పెరుగుతుందా.. పండగ సమయంలో ప్రయాణికుల ఇబ్బంది లేకుండా చూస్తారా లేదా అనే ప్రశ్నలకు ఇంకా సరైన సమాధానం లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో రాజమహేంద్రవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయా ణికుల సంఖ్య కూడా కొన్ని రోజుల పాటు తగ్గి ంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సాధారణ స్థితికి చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

750 మంది రాకపోకలు..

రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజూ 11 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి,న్యూఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్నా యి.తిరుపతికి రోజు విడిచి రోజు ఒక విమానం వెళ్లొస్తుంది. ప్రతీ రోజూ రాజమండ్రి నుంచి సు మారు 750 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.అయితే 4వ తేదీన సంక్షోభం కారణంగా ప్రయాణికుల సంఖ్య సగానికి పడి పోయింది.ఇటీవల మళ్లీ సంఖ్య పెరిగినట్టు అధి కారులు చెబుతున్నారు.ప్రస్తుతం ఇండిగో విమా నాలు 9 మాత్రం నడుస్తున్నాయి.

ఆ రెండు రోజులు చుక్కలే..

ఈ నెల మొదటి వారంలో ఇండిగో సంస్థ ప్రయాణికులకు ఏ విధమైన సమాచారం ఇవ్వ కుండా కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్నింటిని గంటల కొద్దీ ఆలస్యంగా నడిపింది.దీంతో వేలాది మంది విమాన ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 4వ తేదీ రాత్రి రాజమండ్రి నుం చి ముంబయి వెళ్లాల్సిన 160 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే జాగరణ చేశారు. రాత్రి 8.30 గంటలకు రావాల్సిన ముంబయి విమానం 5వ తేదీ తెల్ల వారుజామున 4.30 గంటలకు వచ్చి..ఐదు గంటలకు వెళ్లింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 5వ తేదీ రాత్రి కూడా బెంగళూరు నుంచి ఉద యం రావా ల్సిన విమానం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రావడం గమనార్హం. సుమారు 70 మంది ప్రయాణికులు ఎయిర్‌ పోర్టులోనే ఉం డాల్సి వచ్చింది.చెన్నై విమానం రావాల్సిన రోజు రాకుండా మర్నాడు రావడం గమనార్హం.

పుష్కరాలకు సన్నద్ధం కావాలి..

ఇపుడిప్పుడే విమానాశ్రయం అఽభివృద్ధి చెందు తోంది. విమానాశ్రయ విస్తరణ సాగుతోంది. కార్గో సౌకర్యాలు పెంచుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. రన్‌వే పెరిగింది. ఇండిగో సంక్షోభవం కారణంగా ప్రయాణికుల్లో అపన మ్మకం ఏర్పడింది. అది చక్కదిద్దాల్సి ఉంది. వచ్చే పుష్కరాల నాటికి విమానాల సంఖ్యను పెంచాల్సి ఉంది. దేశంలో ఇతర రాష్ర్టాలు, దేశాలకు విమాన సర్వీసులు నడపాలి.

రేపటి నుంచి 4 ఎయిర్‌బస్‌లు..

ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకూ ఇండిగో సంస్థ ఓ ప్రత్యేక షెడ్యూల్‌ ప్రకటించింది. దీని ప్రకారం ఇటీవల వరకూ నడుస్తున్న 10 ఇండిగో సర్వీసుల్లో 7 చిన్న సర్వీసులను తగ్గించి రద్దయిన వాటి స్థానంలో 180 సీటింగ్‌తో ఉన్న 4 ఎయిర్‌ బస్సులను తిప్పను న్నారు.అంటే ఇండిగో సర్వీసులు ఏడు మా త్రమే నడుస్తాయి. చిన్న విమానాల్లో 70 మంది మాత్రమే ప్రయాణించవచ్చు. ఎయిర్‌బస్సుల్లో 180 మంది వరకూ ప్రయాణించే అవకాశం ఉంటుంది.ఈ నాలుగు ఎయిర్‌ బస్‌లు ముం బయికి వారానికి మూడు రోజులు అంటే ప్రతీ మంగళ,గురు, శనివారాలు మాత్రం నడుస్తుంది. న్యూఢిల్లీకి ఒకటి, హైదరాబాద్‌కు రెండు ఎయిర్‌ బస్‌లు నడపనున్నారు. ఎయిర్‌ బస్‌లు నాలు గు, చిన్నవి మూడు మొత్తం ఏడు సర్వీసులు ఈ నెలాఖరు వరకూ నడవనున్నాయి. తిరుపతికి అలయెన్స్‌ కంపెనీ విమానం వారా నికి మూడు రోజుల పాటు నడుస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్‌ ప్రకటిస్తారు. సంక్రాంతి సమయానికి అన్ని చక్కబడతాయనే అధికారులు చెబుతున్నారు.

విమాన షెడ్యూల్‌ ఇలా..

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ నెల 16 నుంచి 31 వ తేదీ వరకూ ఒక ప్రత్యేక షెడ్యూల్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ టూ రాజమండ్రి ,రాజమండ్రి టూ హైదరాబాద్‌కు ప్రతి రోజూ అటూ ఇటూ మూడు సర్వీసులు ఉ న్నాయి. ఎ320 రకం 6ఈ364 నెంబర్‌తో ఢిల్లీలో ఉదయం 7.20 గంటలకు బయలు దేరి 9.45 గంటలకు రాజమండ్రి చేరుకుం టుంది. 6ఈ363 నెంబర్‌తో ఉదయం 10.15 గంట లకు రాజమండ్రి నుంచి బయలుదేరి 12.35 గంటలకు న్యూఢిల్లీ విమానాశ్రయా నికి చేరుకుంటుంది. ఏటీఆర్‌ 6ఈ7172 నెం బర్‌ విమానం మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు రాజమండ్రి విమానాశ్ర యానికి చేరుకుంటుంది.6ఈ7734 నెంబర్‌తో రాజ మండ్రిలో 12.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.35కి మద్రాసు ఎయిర్‌ పోర్టు కు చేరుతుంది.6320 రకం విమానం 6ఈ 582 నెంబర్‌తో ముంబయిలో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి 5.55 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది.తిరిగి అది 6ఈ 583 నెంబర్‌తో సాయంత్రం 6.25 గం టల కు రాజమండ్రి నుంచి బయలుదేరి రాత్రి 8.15 గంటలకు ముంబయి చేరుకుంటుంది. బెంగళూరుకు రోజూ అటూ ఇటూ ఒక విమాన సర్వీసు ఉంది. వెళ్లడానికి రెండు గంటల సమయం పడుతోంది.

Updated Date - Dec 15 , 2025 | 01:10 AM