వరుణ..కరుణ!
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:47 AM
జిల్లావ్యాప్తంగా వాతావరణం సోమవారం నిలకడగానే కనిపించింది. అధికారులు భయపడిన స్థాయిలో వానలు లేవు.దీంతో అధికార యంత్రాంగం ఊపిరిపీ ల్చుకున్నా రు.
మరో 48 గంటల పాటు హెచ్చరిక
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 18 (ఆం ధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా వాతావరణం సోమవారం నిలకడగానే కనిపించింది. అధికారులు భయపడిన స్థాయిలో వానలు లేవు.దీంతో అధికార యంత్రాంగం ఊపిరిపీ ల్చుకున్నా రు.ఆదివారం రాత్రి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధి కారులు భయపడ్డారు. ముందస్తు జాగ్రత్తచర్యల్లో భాగంగా పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. కాని సోమవారం పరిస్ధితి కాస్త నిలకడగానే ఉన్నప్పటికి మంగళ, బుధవారాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉండ డంతో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో సోమవారం వర్షం కురిసింది.అత్యధికంగా కోరుకొండ మండలంలో 47.0 మి.మీ వర్షపాతం నమోదైంది.అత్యల్పంగా కొవ్వూరు మండలంలో 7.8 మి.మీ వర్షం కురిసింది. గోకవరంలో 33.0 మి.మీ, రాజానగరంలో 28.2 మి.మీ, రంగంపేటలో 28.0 మి.మీ, అనపర్తిలో 27.4 మి.మీ, ఉండ్రాజవరంలో 23.2 మి.మీ, బిక్కవోలులో 22.8 మి.మీ, రాజమహేంద్రవరం రూరల్‌లో 21.8 మి.మీ, కడియంలో 20.4 మి.మీ, పెరవలిలో 19.6 మి.మీ, రాజమహేంద్రవరంలో 18.8 మి.మీ, తాళ్ళపూడిలో 18.4 మి.మీ, చాగల్లులో 17.8 మి.మీ, నిడదవోలులో 17.4 మి.మీ, సీతానగరంలో 17.0 మి.మీ, దేవరపల్లిలో 16.4 మి.మీ , నల్లజర్లలో 15.6 మి.మీ, గోపాలపురంలో 15.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 21.9 శాతం వర్షం కురిసింది. గోదావరి వరదలు పెరగడంతో లంక గ్రామాల్లో ఉన్న మత్స్యకారులను రాజమహేంద్రవరంలో ఏర్పా టు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా అడపాదడపా వర్షాలతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరద పెరిగి వర్షాల వల్ల నగరంలో మురుగునీరు పెరిగితే అవుట్‌ప్లో పరిస్థితిపై కూడా చర్చించారు. నగరంలో ముంపు నివారణకు చర్యలు చేపట్టాని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా ఎటు వంటి ప్రమాధకర సంఘటనలు జరుగకుండా జిల్లా కలెక్టర్ ప్రశాం తి అప్రమత్తం చేశారు. మరొ క 48 గంటల వరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షా లు కురుస్తాయని రాష్ట్ర విప్పత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 19 మండలాల్లో క్షేత్రస్థాయి లో పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశా రు.వర్షాలకు ఇబ్బందికర పరిస్థితులు తలేత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు పర్యటించి తగు జాగ్రత్త చర్య లు చేపట్టాలని ఆదే శాలు జారీ చేశారు.