వానావరణం!
ABN , Publish Date - May 05 , 2025 | 12:37 AM
ఇది ఎండాకాలమా.. వానాకాలమా.. కాదు కలి కాలం.. ఇదీ జనం మాట.. ఎందుకంటే నిండు వేసవిలో జోరువానలు చూసి నోటమాట రావ డంలేదు. వానలకు పట్టణ జనాభా సేదతీరు తుంటే పల్లె జనం మాత్రం పంటను కాపా డుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు.
మండు వేసవిలో జోరువానలు
పల్లపు ప్రాంతాలు జలమయం
స్తంభించిన జనజీవనం
అన్నదాతల్లో అయోమయం
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
రాజమహేంద్రవరం, మే 4 (ఆంధ్రజ్యోతి) : ఇది ఎండాకాలమా.. వానాకాలమా.. కాదు కలి కాలం.. ఇదీ జనం మాట.. ఎందుకంటే నిండు వేసవిలో జోరువానలు చూసి నోటమాట రావ డంలేదు. వానలకు పట్టణ జనాభా సేదతీరు తుంటే పల్లె జనం మాత్రం పంటను కాపా డుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా ప్రతి రోజూ ఉదయం ఎం డ కారణంగా ఉక్కబోతకు ఉక్కిరిబిక్కిరై సాయ ంత్రం వానతో సేదతీరుతున్నారు. అయితే ఆది వారం మాత్రం వరుణుడు భానుడికి చోటివ్వ లేదు.. తెల్లవారుజాము నుంచే దంచి కొట్టాడు. రాజమహేంద్రవరంలో ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటలకు ఏకధాటిగా కురిసిన వాన తో జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం ఆరంభం కావడంతో మార్కెట్లకు వెళ్లడా నికి కూడా జనం ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం నుంచి కాస్త తెరిపిచ్చింది. సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులు లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించింది. తాళ్లపూపడి మండ లంలో గరిష్ఠ వర్షపాతం నమోదు కాగా.. నిడద వోలులో కనిష్ఠంగా వర్షపాతనమోదైంది. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో డ్రెయినేజీలు షరా మామూలుగానే పొంగి పొర్లాయి. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మునిసిపల్ కార్పొరేషన్ సొమ్ములను ఖర్చు పెట్టి డ్రెయి నేజీలు నిర్మించారు. అయినా ముంపు సమస్య నుంచి నగరాన్ని బయటపడేయలేకపోయారు. డ్రైన్లలోని మురుగునీరు రోడ్లపై పారడం, పల్లపు ప్రాంతాలు చెరువులను తలపించడంతో జనం రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. రైల్వేస్టేషను, తమ్మలావ,కంబాల చెరువు, ఆర్టీవో కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఎప్పటి మాదిరిగానే రోడ్లపె,ౖ వీధుల్లో ముంపు నీరు నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అకాల వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారు లను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ముందస్తు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు.ప్రమాదకర హోర్డింగ్‌లు, తక్కు వ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను గమ నించా లన్నారు. భారీ హోర్డింగ్‌లను తనిఖీ చేసి ఏదైనా ఇబ్బంది వస్తుందని గుర్తిస్తే వెంటనే తొలగించా లని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండా లన్నారు.మూడు రోజులు పని చేసే విధంగా జిల్లా కేంద్రం,డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు.వర్షాల వల్ల ప్రతికూల పరిస్థితులు తలెత్తితే వెంటనే టోల్ ఫ్రీ నెంబరు 1070 1800 425 0101, 83339 05022 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 89779 35611,రాజమహేంద్రవరం ఆ ర్డీవో 0883 2442344,కొవ్వూరు ఆర్డీవో 850 0667698కి సమాచారం అందించా లన్నారు.