Share News

పట్టాలెక్కని పనులు!

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:27 AM

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరా రైంది. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకూ నిర్వహించనున్నారు.

పట్టాలెక్కని పనులు!

పుష్కరాలకు ముహూర్తం ఖరారు

కాగితాల్లో మూలుగుతున్న కోట్లు

ఇన్స్‌ఫెక్షన్లు..మీటింగులతో సరి

అంతా డివిజన్‌ నుంచే..

స్థానికంగా అయోమయమే

ముందుకు కదలని పనులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరా రైంది. 2027 జూన్‌ 26 నుంచి జూలై 7 వరకూ నిర్వహించనున్నారు. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం కేంద్ర బిందువు. కోట్లాది మంది జనం తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వాళ్లకు ప్రధాన రవాణా సాధనం రైలు. కానీ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి సంబంధించి అదిగో ఇదిగో అంటూ రైలు రాక మాదిరిగానే కాలయాపన చేస్తు న్నారు. ఇప్పటి వరకూ పుష్కర పనుల పేరు చెప్పి ఒక్క ఇటుకా పడలేదు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కాగితాల్లో ఎదురు చూ పులు చూస్తున్నాయి. ఏదేమైనా రైల్వే పనులు పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశం మాత్రం కను చూపు మేరలో కనబడని రైలు మాదిరిగా మారింది. అభివృద్ధి పనులు పుష్కరాలకు అసం పూర్తిగా ఉంటే యాత్రికులకు తిప్పలు తప్పవు.

అధికారుల హడావుడి!

అమృత్‌ భారత్‌లో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ.274 కోట్లు ఎప్పుడో విడుదలయ్యాయి. వీటితో పుష్కరాల నాటికి రైల్వే స్టేషన్‌ రూపు అద్భుతంగా తయారు కానుందని,సదుపాయాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని చెబుతూ వస్తున్నారు. అయితే ఆ నిధులు మాత్రం కాగితాల నుంచి బయట పడడం లేదు. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి రైల్వే స్టేషన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గత పుష్కరాలకు ఈ రైల్వే స్టేషను ద్వారా రోజుకు సుమారు 50 వేల మంది రాక పోకలు సాగించారు.అప్పట్లో సాధారణ రోజుల్లో 15 వేల వరకూ రాకపోకలు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 35 వేలకు పెరిగింది. అంటే ఈ పుష్కరాలకు రోజుకు లక్ష మంది వరకూ రాజమండ్రి రైల్వే స్టేషను ద్వారా ప్రయాణాలు సాగిస్తారనే అంచనాలున్నాయి. పనుల విష యంలో అధికారుల సమావేశాలు, సందర్శనల తోనే కాలం గడిచిపోతోంది. రెండు నెలల కిం దట విజయవాడలో ఇంజనీరింగ్‌, నిర్మాణం, ఆపరేటింగ్‌, కమర్షియల్‌ తదితర విభాగాల ఉన్నతాధికారులతో డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైల్‌ వికా స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ అధికారులు రాజమండ్రి వచ్చి వెళ్లారు. ఎంపీ పురందేశ్వరి ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రితో తమ ప్రాధాన్యతలపై మాట్లా డి.. ఆయన సూచనలతో హుటాహుటిన రాజమండ్రి రైల్వే స్టేషన్‌ని రైల్వే బోర్డు, జోనల్‌, డివిజనల్‌ స్థాయి అధికారులతో సందర్శించారు. జూలై 26న రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి ప్రిన్సి పల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎన్‌.రమేశ్‌ వచ్చారు. విజయవాడ డివిజన్‌ రైల్వే మేనేజరు మోహిత్‌ సోనాకియా ఆగస్టు 2న రాజమండ్రి, గోదావరి రైల్వే స్టేషన్లలో కలియదిరిగారు. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌పై చర్చించారు. గోదావరి పుష్కరాలు-2027కి సంబంధించి రైల్వే పనులు మొదలయ్యాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ ఆగస్టు 6న రాజమండ్రి రైల్వే స్టేషను పరిశీలన సందర్భంగా ప్రకటించారు. నేటికీ పనులు ఆరంభమే కాలేదు. క్షేత్రస్థాయిలో పనులు ఎప్పుడు ఆరంభించి.. ఎప్పుడు పూర్తి చేస్తారో జవాబు దొరకని ప్రశ్నగానే కొనసాగుతోంది.

అంతా గజిబిజి

రైల్వే స్టేషను అభివృద్ధి పనుల్లో అంతా గజిబిజి నడుస్తోంది. అంతా విజయవాడ నుంచి నడుపుతుండడంతో స్థానిక అధికా రులకు ఎప్పుడు ఏమి చేస్తారో తెలి యడం లేదు. పుష్కరాల నాటికి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తయ్యే అవకాశం కనబడడం లేదు. తూర్పు వైపున ఐదు ఫ్లోర్లతో భవనం రావాల్సి ఉండగా.. రెండు ఫ్లోర్లను స్లాబుల వరకూ నిర్మించి పుష్క రాల తర్వాత గదులు, ఇతర పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వాటిని కూడా పుష్కర విధులకు వచ్చే సిబ్బంది బస కోసం వినియోగించనున్నారు. ఆరో ప్లాట్‌ఫాం పూర్తి చేయాలని చూస్తున్నారు. స్టేషన్‌ ఆధునికీకరణ పూర్తయితే 20 వర కూ ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, తూర్పు వైపున 5 అంతస్తులు, పశ్చిమాన 3 అం తస్తులు, రిటైల్‌ అవుట్‌లెట్లతో 24మీటర్ల వెడల్పు, 110 మీటర్ల నిడివితో రూఫ్‌ ప్లాజాలు, 6 మీటర్ల వెడల్పుతో ఎఫ్‌వో బీలు, పశ్చిమాన బాగా పెద్ద సర్క్యులే టింగ్‌ ప్రదేశం అందు బాటులోకి రావాల్సి ఉంది. కానీ పుష్కరాల నాటికి వీటిలో సగం పనులు పూర్తయితే యాత్రికుల అదృష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రైల్వే స్టేషనులో మూడు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ఉన్నాయి.వాటిలో కల్యాణ మండపం వద్ద ఉన్న వంతెనను తొలగిస్తారు. మిగతా రెండు బ్రిడ్జిలకు అదనంగా మరో రెం డింటిని నిర్మించనున్నారు. వీటికి సంబం ధించి మంగళవారం మట్టి పరీక్షలు చేశా రు.గోదావరి రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ ఫాం నిడివిని బ్రిడ్జి వైపు పొడిగించడాని కి ఉన్న అవకాశాలను పరిశీలించినా పను లు పుష్కరాలకు పూర్తికావని తెలుస్తోంది.

Updated Date - Dec 20 , 2025 | 01:27 AM