Share News

త్వరితగతిన రైల్వే లైన్‌ పూర్తికి కృషి : ఎంపీ

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:48 AM

కోనసీమలో నర్సాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు కృషి చేస్తున్నట్టు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి అన్నారు.

త్వరితగతిన రైల్వే లైన్‌                   పూర్తికి కృషి : ఎంపీ

మలికిపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కోనసీమలో నర్సాపురం-కోటిపల్లి రైల్వేలైన్‌ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేందుకు కృషి చేస్తున్నట్టు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌బాలయోగి అన్నారు. రాజోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం గుడిమెళ్లంకలో కూటమి నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలైన్‌ ప్రస్తావన తెచ్చారు. రైల్వేలైన్‌కు నిధుల కొరత లేదని, సాంకేతిక అడ్డంకులు తొలగి పనులు వేగవంతంగా జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య 216 బైపాస్‌ నిర్మాణం, రాజుల్లంక-రామేశ్వరం మధ్య వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణం కోసం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ సహకారంతో అడ్డంకులు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎంపీని కలిసిన వారిలో జనసేన పార్టీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రాపాక రమేష్‌బాబు, అంతర్వేది సొసైటీ అధ్యక్షుడు రావూరి నాగు, ఓగూరి మనోహర్‌, టీడీపీ నాయకుడు చవ్వాకుల వెంకటరత్నం తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 01:48 AM