నేడు రైల్వే జీఎం వస్తారు.. ఏం చూస్తారో!
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:13 AM
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఈ నెల 12న రానున్న విషయం విదితమే. అయితే ఆయన పర్యటన వస్తారు..వెళ్తారు.. అనే మాదిరిగా సాగనుంది.

స్టేషన్ పరిశీలన లేనట్లేనట
45 నిమిషాలే తనిఖీ
రాజమహేంద్రవరం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఈ నెల 12న రానున్న విషయం విదితమే. అయితే ఆయన పర్యటన వస్తారు..వెళ్తారు.. అనే మాదిరిగా సాగనుంది. గతంలో జీఎం తనిఖీలు ఉంటే స్టేషన్ ఆసాంతం పరిశీ లించడం జరిగేది.ఉద్యోగుల క్వార్టర్లతో సహా అన్నిటినీ ముస్తాబు చేసేవాళ్లు. ప్రయాణికుల సదుపాయాలు, ట్రాక్‌లు, యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, పరిశుభ్రత, ఆహారం, ధరలు వంటివి జీఎం, ఆయనతో పాటు ఉండే ఉన్నతాధి కారులు గమనించి తగు చర్యలు తీసుకోవడం ఉండేది. ఇప్పుడు నిధుల కొరత వల్ల భద్రతా పనులకే పరిమిత మయ్యారని అంటున్నారు. దీంతో ఎన్నో నెలల నుంచీ పనిచేయకపోయినా పట్టింపులేకుండా ఇప్పుడు జీఎం వస్తున్నారని ఓ మూడు పరిశుభ్రత యంత్రాలను తీసు కొచ్చి పెట్టారు. బాగానే ఉన్న కుర్చీలను సైతం తీసేసి స్టీలు కుర్చీలు వేశారు. నిధుల కొరత వల్ల ఉన్నంతలో సరిపెట్టారు. వాస్తవానికి ఆయన గత నెల 9న రావాల్సి ఉంది. కానీ కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో తేదీ లను పొడి గిస్తూ వచ్చారు. ముఖ్యంగా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ని రూ.273 కోట్లతో తీర్చిదిద్దనున్నారు. వీటిని పుష్కరాలకు.. అంటే ఇంకా రెండేళ్లలో ఎట్టి పరిస్థితు ల్లోనూ పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ఈ నేప థ్యంలో జీఎం రాజమండ్రిలో ఎంత వరకూ సమయం గడుపుతారో అనే సందేహం ఉత్పన్నమవుతోంది. అభి వృద్ధి పనుల్లో భాగంగా తూర్పు రైల్వే స్టేషను వైపు భవనానికి జీఎం వచ్చినప్పుడు శంకుస్థాపన చేయించా లని అనుకున్నా అదీ జరిగేట్లు లేదు. ఎందుకంటే అభి వృద్ధి పనులు టెండర్ స్థాయిని దాటలేదు. జాంపేట బ్రిడ్జి కింద ప్రాంతంలో ట్రాక్ పనులు పెండింగ్ ఉండ డం వల్ల మరో దారిలో ఆయ నను తీసుకెళ్లడానికి ఆలో చన చేశారని తెలుస్తోంది. రాజమండ్రి 10.45 గంటలకు వచ్చి 11.30 గంటలకు వెళతారు. ఏడాదికి ఒకసారి తని ఖీలకు వచ్చే జీఎం కేవలం 45 నిమిషాలు మాత్రమే ఇక్కడ కేటాయించే విధంగా ప్రణాళిక వేశారు.
నిడదవోలు జంక్షన్..ఆగని రైళ్లతో టెన్షన్
నేడు నిడదవోలుకు రైల్వే జీఎం రాక
నిడదవోలు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నిడద వోలు రైల్వే జంక్షన్ పేరుకు మాత్రమే.. సూపర్ ఫాస్ట్ రైలు ఎక్కాలంటే ప్రయాణికులు పక్క స్టేషన్‌కు వెళ్లాల్సిందే. స్టేషన్‌కు ఆదాయం బాగానే ఉన్నా రైళ్లు ఆగకుండానే వెళ్లి పోతుంటాయి. నిడదవోలు జంక్షన్ మీదుగా సుమారు రోజుకి 75 రైళ్ళ వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే దూర ప్రాంతాలకు వెళ్లేం దుకు ఉన్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ లేకపో వడంతో ప్రయాణికులు అటు రాజమహేంద్రవరం ఇటు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లకు వెళ్లి రాకపోకలు సాగిస్తున్నారు.దీంతో ప్రయాణికులు అవస్థలు పడు తున్నారు. గూడ్స్‌ల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.12 కోట్లు, ప్రయా ణికుల ద్వారా సంవత్సరానికి సుమారు రూ.15.60 లక్షలు ఆదాయం వస్తుంది. అయితే నిడదవోలు జంక్షన్ మీదుగా ముంబాయి, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ రైళ్ళు ఆగడంలేదు. కాకినాడ - లిం గంపల్లి (కోకనాడ ఎక్స్‌ప్రెస్),విశాఖపట్టణం - లిం గంపల్లి (జన్మ భూమి), కాకినాడ - ముంబాయి (సీవో ఎల్‌టి), విశా ఖపట్టణం - ముంబాయి (ఎల్‌టీటీ) రైళ్ళకు హాల్ట్‌లు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైల్వే జీఎం బుధవారం మధ్యాహ్నం 1.15 నుంచి 2 గంటల వరకు నిడదవోలులో ఆగనున్న నేపఽథ్యంలో కూ టమి నాయకులు నిడదవోలులో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ల హాల్ట్‌కు సంబంధించి విన్నవించాలని ప్రజలు కోరు తున్నారు. నిడదవోలు రైల్వే స్టేషన్‌కు కేంద్ర ప్రభు త్వం అమృత భారత్ పథకం ద్వారా సుమారు 27 కోట్ల నిధులు మంజూరు చేసింది.దీంతో ఈ నెలా ఖరుకి పనులు పూర్తి చేసే లక్ష్యంతో స్టేషన్‌లో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.