బాణసంచా పేలుడు ఘటనలో పదికి చేరిన మృతుల సంఖ్య
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:10 AM
అనపర్తి/ రాయవరం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం విసావరం గ్రామ పరిధిలో గణపతి ఫైర్ వర్క్స్‌లో ఈనెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సంఘటనలో ఆరు గురు సజీవ దహనం కాగా మరో నలుగురు
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి
తమకు న్యాయం చేయాలంటూ అనపర్తిలో బంధువుల ఆందోళన
అనపర్తి/ రాయవరం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం విసావరం గ్రామ పరిధిలో గణపతి ఫైర్ వర్క్స్‌లో ఈనెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య పదికి చేరుకుంది. సంఘటనలో ఆరు గురు సజీవ దహనం కాగా మరో నలుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా అదే రోజు ఒకరు, మరుసటి రోజు ఒకరు, ఆదివారం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన రోజు యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణ, పాకా అరుణ, చిట్టూరి శ్యామల, పెంకే శేషా రత్నం, కురుపూడి జ్యోతి, కె.సదానంద్ సజీవదహనం కాగా అదే రోజు ఆసుపత్రిలో పొట్నూరి వెంకటరమణ మృతి చెందగా మరుసటి రోజు వాసంశెట్టి విజయలక్ష్మి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆదివారం చిట్టూరి యామిని (30), లింగం వెంకటకృష్ణ(22) చికిత్స పొందు తూ మృతి చెందారు. కాకినాడలో జీజీహెచ్ లో అనపర్తికి చెందిన చిట్టూరి యామి ని మృతి చెందడంతో పోస్టుమార్టం అనంతరం అధికారులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని అనపర్తికి తరలించారు. అయితే యామిని బంధువులు మృతదేహాన్ని కొమరిపాలెంలోని యజమాని ఇం టికి తరలించే ఆలోచన చేయడంతో పోలీసులు అంబులెన్స్‌ను రెండు జీపులతో వెంబడించారు. బలభద్రపురం వంతెన వద్ద కొమరిపాలెం వైపు అంబులెన్స్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు మృతదేహాన్ని అనపర్తిలోని యామిని ఇంటికి చేర్చారు. అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని దించేది లేదంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యామిని ఇంటికి అధి కారులను పంపించడమే కాకుండా ఫోన్‌లో యా మిని భర్త శ్రీనుతో మాట్లాడారు. ఇప్పటికే విచారణ కోసం కమిటీని నియమించడం జరిగిందని, 2,3 రోజుల్లో అక్స్‌గ్రేషియా ప్రకటన వెలువడుతుందని ఆందోళన చెందవద్దంటూ వివరించారు. యజమాని కుమారుడు చిట్టిబాబు కూడా శ్రీనుతో మాట్లాడటంతో మృతుల బంధువులు శాంతించారు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ(22) ఆదివారం మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.