క్వారీ గోతుల పూడ్చివేతకు చర్యలు
ABN , Publish Date - May 14 , 2025 | 12:42 AM
రాజమహేంద్రవరంలోని రామదాసుపేట, సు బ్బారావు నగర్ ప్రాంతాల్లో కంకర కోసం తవ్విన క్వారీ గోతులను పూడ్చే విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశిం చారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్, ఆర్ అండ్‌బీ తదితర శాఖలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారీల లీజు పొందిన 51 సం స్థలు మెటల్(కంకర) తవ్విన తర్వాత సదరు గోతులను మట్టితో పూడ్చాలనే నిబంధన పాటిం చలేదనే విషయం తెలిసింద న్నారు.
రెండున్నర కిలోమీటర్లు రోడ్డు నిర్మించండి
లీజుదారులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్
బ్లాక్ లిస్టులోని లీజుదారుల నుంచి రిక్లమేషన్ చార్జీల రికవరీకి ఆదేశాలు
రాజమహేంద్రవరం, మే 13(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని రామదాసుపేట, సు బ్బారావు నగర్ ప్రాంతాల్లో కంకర కోసం తవ్విన క్వారీ గోతులను పూడ్చే విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశిం చారు. ఈ మేరకు మునిసిపల్ కార్పొరేషన్, ఆర్ అండ్‌బీ తదితర శాఖలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వారీల లీజు పొందిన 51 సం స్థలు మెటల్(కంకర) తవ్విన తర్వాత సదరు గోతులను మట్టితో పూడ్చాలనే నిబంధన పాటిం చలేదనే విషయం తెలిసింద న్నారు. ఆయా క్వారీ గోతుల వల్ల సమీప ప్రాంతాల్లో నివ సించే ప్రజలు వినియోగించే రహదారి ప్రమాదకరంగా మా రిందన్నారు. ఆ దారిలో వెళ్లే సమయంలో ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని సూచించా రు. ప్రమాదాలు సంభవించ కుండా చేయడంలో భాగంగా రెండున్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి, ఫెన్సింగ్ వేయడంతోపాటు లై టింగ్, సైన్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ పూర్తయ్యేలోపు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు ప్రజలకు అవగాహ న కల్పించాలన్నారు. రహదారి నిర్మాణ పనులకు సంబంధించి సాంకేతిక అంశాల పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి క్వారీల ను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మార్గదర్శ కాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. బ్లాక్ లిస్టులో పెట్టిన లీజుదారుల వివరాలను అన్ని శాఖలకు పంపాలని, రిక్లమేషన్ చార్జీల రికవరీ కోసం నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రాజేం ద్రనగర్, సుబ్బారావుపేట, నెహ్రూనగర్, బర్మాకా లనీ, బత్తిన నగర్, సంజీవయ్యనగర్, సింహాచల నగర్, రామదాసుపేట, ఆనంద్‌నగర్‌లో ఉన్న 22ఏ భూముల క్రమబద్ధీకరణ వివరాలను అం దజేయాలన్నారు.సమావేశంలో కార్పొరేషన్ కమి షనర్ కేతన్‌గార్గ్, మైనింగ్ శాఖ ఏడీ డి.ఫణి భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.