Share News

పుష్కర..నిధులేవి!

ABN , Publish Date - May 09 , 2025 | 01:17 AM

మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.అంటే 2027 మే నెలలో నిర్వ హించే అవకాశం ఉన్న గోదావరి పుష్క రాలకు దాదాపు రూ.3 వేల కోట్లతో ప్రాథ మికంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

పుష్కర..నిధులేవి!
పుష్కరఘాట్‌

మునిసిపల్‌ కార్పొరేషన్‌.. రెండు రెవెన్యూ డివిజన్లకు

ఇప్పటికే రైల్వే స్టేషనుకు రూ.274 కోట్లు మంజూరు

2500 బస్సు సర్వీసులకు ఆర్టీసీ ప్రతిపాదనలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.అంటే 2027 మే నెలలో నిర్వ హించే అవకాశం ఉన్న గోదావరి పుష్క రాలకు దాదాపు రూ.3 వేల కోట్లతో ప్రాథ మికంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గత పుష్కరాలకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ పుష్కరాలకు సుమారు 5 కోట్ల మంది తరలివచ్చారు.ఇప్పుడు మళ్లీ సీఎంగా చం ద్ర బాబు ఉన్నారు.కేంద్ర ప్రభుత్వం కూ టమిలో అంతర్భాగమై ఉంది.దీంతో గతం కంటే వైభ వంగా పుష్కరాల నిర్వహణకు కసరత్తు చేస్తు న్నారు. ఇప్పటికే ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వీరపాండ్యన్‌, విజయరామ రాజు లను పుష్కరాల ప్రత్యేక అధికారులుగా నియ మించారు. మరో వైపు అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రాజమహేం ద్రవరానికి రూ.2 వేల కోట్లతో పుష్క ర ప్రతి పాదనలు పంపించామని సిటీ ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్‌ ప్రకటించారు.ఇక పుష్కర పను లు శ్రీకారమే తరు వాయిగా కనబడుతోంది.

అంచనా రూ.3 వేల కోట్లు

2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరాలు నిర్వహించారు. అప్పట్లో కేవలం రాజమహేంద్రవరంలోని ఘాట్ల అభివృద్ధి తదితర ఏర్పాట్లకు రూ.200 కోట్లు విడుదల చేశారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌, రెవెన్యూ, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో చేపట్టా ల్సిన పనులపై ఇప్పటికే అధికారులు అంచనాలు రూపొందించారు. రాజమహేంద్రవరం కార్పొరేష న్‌కు ప్రత్యేకంగా, మిగతా శాఖలకు ఆయా రెవెన్యూ డివిజన్ల కింద నిధులు విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రెవెన్యూ డివిజన్లకు రూ.1400 కోట్లతో అంచనాలు రూపొందించగా.. మరోవైపు నగర పాలక సంస్థ ఇప్పటికే 1587.80 కోట్లతో ప్రతిపా దనలు సిద్ధం చేసింది.రాజమహేంద్రవరం డివిజన్‌లో దాదాపు 550 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ చేయడానికి రూ.400 కోట్లు అవసరత చూపిం చారు. కొవ్వూరు డివిజన్‌కు సంబంధించి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశా రు. ఘాట్లకు వెళ్లే రహదారులు, ప్రధాన, పా ర్కింగ్‌ ప్రాంతాలకు..ఇలా నాలుగు విభాగాలుగా రహదారుల అంచనాలను రూపొందించా రు. రాజమహేంద్రవరం తో పాటు కొవ్వూరు, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో ఘాట ్లను మరింత అభివృద్ధి చేయనున్నారు.

గతం కంటే మెరుగ్గా

గత పుష్కరాలకు రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘా ట్‌ను 1.5 కిలోమీటర్ల నిడివితో నిర్మించారు. మిగతా ఘాట్లను అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే చేయడంతో పాటు కొత్తవి నిర్మించే అవకాశం ఉంది. ఈ మేరకు నిడదవోలు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో 29 ఘాట్లకు మరమ్మతులు, 4 కొత్త వాటికి రూ.100 కోట్లతో అం చనాలు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌, సీతాన గరం, కడియం మండలాల్లో 23 ఘాట్లకు మరమ్మతులు, 5 కొత్త ఘాట్ల నిర్మాణాలకు రూ.7 కోట్లు ప్రతిపాదించారు. మరో వైపు పర్యాటకానికి పెద్దపీట వేయనున్నారు. రాజమహేం ద్రవరం, కొవ్వూరు డివిజన్లలో సుమారు రూ.440 కోట్ల అం చనా వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేశారు.అగ్నిమాపక శాఖ రూ.8 కోట్లు, ఆర్టీసీ రూ.27కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా రూ.25కోట్లు, వైద్యా రోగ్య రూ.8కోట్లు, విద్యుత్తు రూ.50కోట్లు..ఇలా అన్ని శాఖలూ ఆయా ఆర్డీవోలకు ప్రతిపాదనలు అందజేశాయి.

పట్టాలెక్కని.. రైల్వే పనులు

అమృత్‌ భారత్‌లో భాగంగా రాజమండ్రి రైల్వే స్టేషను అభివృద్ధికి రూ.274 కోట్లు విడుదలయ్యాయి. వీటితో రైల్వే స్టేషను రూపు అద్భుతంగా తయారు కానుంది. కానీ ఇంకా పనులు ఆరంభంకాలేదు. పనులు అంచనాల దశలోనే ఉన్నాయి. టెండర్లు ఎప్పటికి ఖరారు అవుతాయో పనులు ఎప్పుడు పట్టాలెక్కుతాయో ఇతమిత్థంగా తెలియని పరిస్థితి నెలకొంది. స్టేషన్‌ ఆధునికీకరణ పూర్తయితే 20 వరకూ ఎస్కలేటర్లు,7 లిఫ్టులు, తూర్పు వైపున 5 అంత స్తులు, పశ్చిమాన 3 అంతస్తులు, రిటైల్‌ అవుట్‌ లెట్లతో 24 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల నిడి వితో రూఫ్‌ ప్లాజాలు, 6 మీటర్ల వెడల్పుతో ఎఫ్‌వోబీలు, పశ్చిమాన బాగా పెద్ద సర్క్యులేటింగ్‌ ప్రదేశం అందుబాటులోకి రానున్నాయి. గతంలో 1700 ఆర్టీసీ సర్వీసులు నపడగా ఇప్పుడు 2500 బస్సుల అవసరత ఉందని రాజమండ్రి ఆర్టీసీ అధికారులు ఆర్డీవోకి ఇచ్చిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

Updated Date - May 09 , 2025 | 01:17 AM