Share News

సమయంలేదు మిత్రమా!

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:17 AM

గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకూ నిర్వహించనున్నారు. రోజులు తరుగుతున్నాయి. ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.

సమయంలేదు మిత్రమా!
రాజమహేంద్రవరంలో రివర్‌ ఫ్రంట్‌ పనులు

రెండేళ్లలో గోదావరి పుష్కరాలు

రూ.3 వేల కోట్లతో అంచనాలు

ఇంకనూ ప్రతిపాదనల్లోనే పనులు

ఎక్కడా ఆరంభంకాని వైనం

కానరాని పుష్కర ప్రత్యేకాధికారులు

కేవలం రూ.100 కోట్లు విడుదల

అవీ అఖండ గోదావరి నిధులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకూ నిర్వహించనున్నారు. రోజులు తరుగుతున్నాయి. ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. కానీ చేయాల్సిన పనులు మాత్రం బోలెడు ఉన్నాయి. గత పుష్కరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిం చింది. సుమారు 5 కోట్ల మంది జనం పుణ్య స్నానాలు ఆచరించారు. ఇప్పుడు ఆ సంఖ్య 10 కోట్లు ఉంటుందని అంచనా.కానీ పనులు మా త్రం ఇంకా కాగితాలపై ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించినా వాళ్లు ఇంకా ఆ విధులకు ఓంకారం చుట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం 12 మందితో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది.అది కూడా పనిలోకి దిగాల్సి ఉంది.పుష్కర పనులకు శ్రీకారం ఎప్పు డా అని గోదారమ్మ ఎదురు చూస్తోంది.

నిధుల వరద కాగితాల్లోనే..

అన్ని శాఖలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాయి. ముసాయిదా ప్లాన్‌ సిద్ధమైంది. ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని సుమారు 20 ప్రధాన ఘాట్లలో రోజుకు లక్ష మంది వరకూ పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వర కూ పర్యాటక, దేవాదయ, జల వనరులు, రెవె న్యూ, మునిసిపల్‌ శాఖలు మాత్రం పలు సమీ క్షలు నిర్వహించాయి. పుష్కర భక్తులకు బస, రవాణా ఏర్పాట్లతో పాటు ఇప్పటికే రాజమ హేంద్రవరంలో ఉన్న ఘాట్లకు అదనంగా మరో 4 నిర్మించాలని నిర్ణయించారు.వీటికి రూ.900 కో ట్లతో, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో రోడ్లకు రూ.460 కోట్లు,ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.680 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించా రు.మొత్తంగా సుమారు రూ.3 వేల కోట్లు ఖర్చ వుతుందని ప్రాథమిక అంచనా వేస్తుండగా.. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటా యించింది.ఇటీవల అఖండ గోదావరి ప్రాజె క్టు పనులు రూ.100 కోట్ల అంచనాతో ప్రారం భిం చారు.రివర్‌ఫ్రంట్‌ పనులు జరుగుతున్నాయి. మిగిలిన పనులకు కొబ్బరి కాయలు కొట్టలేదు.

డివిజన్ల వారీగా ప్రతిపాదనలు..

2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరా లు నిర్వహించారు. అప్పట్లో రాజమహేంద్రవ రంలోని ఘాట్ల అభివృద్ధి తదితర ఏర్పాట్లకు రూ.200 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత మా ర్కెట్‌ రేట్ల ప్రకారం ఇప్పుడు ఆ బడ్జెట్‌ గణనీ యంగా పెరగనుంది.రాజమహేంద్రవరం ముని సిపాలిటీకి ప్రత్యేకంగా,మిగతా శాఖలకు ఆయా రెవెన్యూ డివిజన్ల కింద నిధులు విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రెవెన్యూ డివిజన్లకు రూ.1400 కోట్లతో అంచనాలు రూపొందించగా.. మరోవైపు నగర పాలక సంస్థ ఇప్పటికే 1587.80 కోట్లతో ప్రతి పాదనలు సిద్ధం చేసింది.రాజమహేంద్రవరం డివిజన్‌లో దాదాపు 550 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, మరమ్మతులు, విస్తరణ చేయడానికి రూ.400 కోట్లు అవసరత చూపిం చారు.కొవ్వూరు డివిజన్‌కు సంబంధించి రూ.250 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఘాట్ల కు వెళ్లే రహదారులు, ప్రధాన, పార్కింగ్‌ ప్రాం తాలకు..ఇలా నాలుగు విభాగాలుగా రహదా రు ల అంచనాలు..రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో ఘాట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు.

గతం కంటే మెరుగ్గా

గత పుష్కరాలకు రాజమహేంద్రవరంలోని కోటిలి ంగాల ఘాట్‌ను 1.5 కిలోమీటర్ల నిడివితో నిర్మించారు. మిగతా ఘాట్లను కూడా అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాటికి ఏమైనా మరమ్మతులు ఉంటే చేయడంతో పాటు కొత్తవి కూడా నిర్మి స్తారు. కోటిలింగాల ఘాట్‌ నుంచి పుష్కరాల రేవు గుండా వీఐపీ ఘాట్‌ వరకూ ఒకే ఘాట్‌ నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. నిడద వో లు, కొవ్వూరు,తాళ్లపూడి మండలాల్లో 29 ఘాట్ల కు మరమ్మతులు,4 కొత్త వాటికి రూ.100 కోట్ల తో అంచనాలు సిద్ధం చేశారు. రాజమహేంద్ర వరం రూరల్‌, సీతానగరం, కడియం మండలా ల్లో 23 ఘాట్లకు మరమ్మతులు,5 కొత్త ఘాట్ల నిర్మాణాలకు రూ.7 కోట్లు ప్రతిపాదించారు. మ రోవైపు పర్యాటకానికి పెద్దపీట వేయనున్నారు.

రూ.3 వేల కోట్లు

రాజమహేంద్ర వరం,కొవ్వూరు డివిజన్లలో సు మారు రూ.440 కోట్ల అంచనా వ్యయంతో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేశారు. రెండు డివిజన్లకూ కలిపి అగ్నిమాపక శాఖ రూ.8 కోట్లు, ఆర్టీసీ రూ.27 కోట్లు, పం చాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా రూ.25 కోట్లు, వైద్యారోగ్య రూ.8 కోట్లు, విద్యుత్‌ రూ.50 కోట్లు ఇలా అన్ని శాఖలూ ప్రతిపాదనలు పంపించాయి. మొత్తంగా 12 రోజుల్లో దాదాపు 10 కోట్ల మంది రాజమ హేంద్రవరం పరిసర ప్రాంతాలకు పుష్కర స్నా నాలకు వస్తారని అంచనా వేస్తుండగా.. రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి భక్తులకు ఇబ్బందీ కలగకుండా చూ డాలని ప్రభుత్వం భావిస్తోంది.

చిన్నమ్మ చొరవ చూపాల్సిందే..

రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. రైల్వేపరంగా ఎంపీ వేగంగా కదిలినా పనుల్లో కదలిక కనిపించడం లేదు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వ నిధులే అత్యంత ప్రాధా న్యమైనవి.ఆ ని ధుల రాకలో కదలిక ఉండాలంటే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అయినా ఎంపీ ప్రస్తావించాలి. అయితే ఇప్పటి వరకూ కనీసం అధికారులు ఒక సమగ్రమైన డీపీఆర్‌(డిటెయిల్డ్‌ ప్రాజె క్ట్‌ రిపోర్టు) ఆమె చేతికి అందించలేదు. దీనిపై ఆమె కూడా కాస్త అసహనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. చివ రి నిమిషంలో హడా వుడి పడితే నిధుల దుర్విని యో గం కావడంతో పాటు పనుల్లో నాణ్యత కూడా నాసిర కంగా మారే అవకాశానికి మార్గం సుగమం చేసినట్లే.

Updated Date - Jul 15 , 2025 | 01:17 AM