Share News

పుణ్యక్షేత్రంలో విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం!

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:00 AM

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో రూ.4 కోట్లతో విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో అటవీ శాఖాధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు.

 పుణ్యక్షేత్రంలో విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం!
అఽధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే బత్తుల

  • అటవీ అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో రూ.4 కోట్లతో విదేశీ పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో అటవీ శాఖాధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు.విదేశీ పక్షుల సంరక్షణ, సం దర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విదేశాల నుంచి వలస వచ్చి సందడి చేస్తున్న పక్షులను గ్రామస్ధ్థులు తమ ఆడపడుచులుగా భావించి ప్రేమగా చూసుకుంటారన్నారు.దేశ ఎల్లలు దాటి వేలాది మైళ్లు ప్రయాణించి, సుమా రు ఆరు నెలల పాటు (శీతాకాలం)లో పుణ్యక్షేత్రం గ్రామానికి విడిదిగా చేసుకుంటాయన్నారు. గ్రామంలో చెరువు గట్టుపై ఉన్న చెట్లపై గూళ్లు కట్టుకుని నివసిస్తూ ప్రజలకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. దాదాపు 125 సంవత్సరాలుగా ఈ విదేశీ పక్షులు పుణ్యక్షేత్రం వస్తున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఊర చెరువును అభివృద్ధి చేసి సందర్శకులకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడతామన్నారు. పక్షుల ఆవాసానికి అనువుగా నిర్మాణాలు చేపడతామన్నారు. పక్షులను తిలకించేందుకు ప్రత్యేకించి వాచ్‌ టవర్లు, చిల్డ్రన్‌ ప్లే జోన్లు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. టూరిస్టులకు మాత్రమే కాకుండా విద్యార్ధులు, పరిశోధకులు, పక్షి ప్రేమికులకు ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో రాజమహేంద్రవరం జిల్లా ఫారెస్టు ఆఫీసర్‌ వి.ప్రభాకరరావు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పద్మావతి దేవి తదితరులు పాల్గొన్నారు.

  • ప్రజా సంక్షేమమే లక్ష్యం

సీతానగరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పల్లెబాట-జనవాణి కార్యక్రమంలో భాగంగా మండలంలోని నాగంపల్లి, చీపురుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జనవా ణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారాని కి అధికారులతో మాట్లాడారు.ముందుగా నాగం పల్లిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి సాధారణ, నేత్ర, దంత వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడు తున్న కందికట్ట రత్నంరాజు ఇంటికి వెళ్లి పరామర్శించారు. రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో జనసేన నా సేన నా వంతు కో ఆర్డినేటర్‌ బత్తుల వెంకటలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 01:00 AM