బరువు 1.8 కిలోలు.. ధర రూ.22 వేలు
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:21 AM
యానాం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు కిలో 800 గ్రాముల బరువు ఉన్న పులస చిక్కింది. దీనిని ఆదివారం యానాం మార్కెట్‌లో పోనమండ భద్రం, రత్నం దంపతులు రూ.22వేలకు పాడి దక్కించుకున్నారు. గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో పు
యానాం మార్కెట్‌లో పులస
యానాం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు కిలో 800 గ్రాముల బరువు ఉన్న పులస చిక్కింది. దీనిని ఆదివారం యానాం మార్కెట్‌లో పోనమండ భద్రం, రత్నం దంపతులు రూ.22వేలకు పాడి దక్కించుకున్నారు. గౌతమి గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతాయి. వారం రోజుల క్రి తం యానాం మార్కెట్‌కు తొలి పులస వచ్చి రూ.18వేల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే రానున్న వరదకు మరిన్ని పులసలు దొరికే అవకాశం ఉందని మత్స్యకారులు చెప్తున్నారు.