గోదావరి మధ్యలో మత్స్యకారుల పూజలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:11 AM
యానాం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): యానాంలో గోదావరి మధ్యలో (ఐలాండ్) మత్స్యకారులు పూజలు నిర్వహించారు. యా నాంలోని కొత్తపేట, అగ్రహారం, ప్రాన్స్‌తిప్ప గ్రామల మత్స్యకారులు ప్రతీ సంవత్సరం గోదావరి నీరు తగ్గిన తర్వాత వేటకు బయలుదేరే ముందు గోదావరి మధ్యలో ఉన్న ఐలాండ్‌లో
పాలు పొంగించి భైరవస్వామికి నైవేద్యం సమర్పణ
యానాం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): యానాంలో గోదావరి మధ్యలో (ఐలాండ్) మత్స్యకారులు పూజలు నిర్వహించారు. యా నాంలోని కొత్తపేట, అగ్రహారం, ప్రాన్స్‌తిప్ప గ్రామల మత్స్యకారులు ప్రతీ సంవత్సరం గోదావరి నీరు తగ్గిన తర్వాత వేటకు బయలుదేరే ముందు గోదావరి మధ్యలో ఉన్న ఐలాండ్‌లో భైరవస్వామికి పాలు పొంగించి నైవేద్యం సమర్పించే పవిత్ర సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం నిర్వహించిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నావలో ఐలాండ్‌కు వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం మత్స్యకారులందరూ పాలు పొంగించిన నైవేద్యాన్ని భైరవస్వామి) సమర్పించారు. మత్స్యకార ప్రతినిధి మల్లాడి శామ్యూల్, గ్రామ పెద్దలు ఉన్నారు.