ప్రజా సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Aug 02 , 2025 | 01:03 AM
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వితంతు పింఛన్లను ఆర్డీవో కృష్ణనాయక్‌తో కలిసి ఆయన అందజేశారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
పలుచోట్ల వితంతు పెన్షన్ల పంపిణీ
ధవళేశ్వరం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన వితంతు పింఛన్లను ఆర్డీవో కృష్ణనాయక్‌తో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు అమలవుతున్నాయన్నారు. వితంతు పింఛన్లు నూతనంగా రాజమహేంద్రవరం రూరల్ మండంలో 284 మంజూరు కాగా ధవళేశ్వరంలో 69 మందికి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, తహశీల్దార్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, టీడీపీ మండలాధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్, వాసిరెడ్డి రాంబాబు, పండూ రి అప్పారావు, పుకళ్ల రాజు, తలారి మూర్తి, సావాడ శ్రీనివాసరెడ్డి, ఆళ్ల ఆనందరావు పాల్గొన్నారు.
పింఛన్ల విధానంలో మార్పులు
రాజానగరం/కోరుకొండ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): గతంలో 6 నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారని, ప్రస్తుతం పింఛన్ల విధానంలో కీలక మార్పులు తెచ్చామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. రాజానగరం మండలంలోని పలు గ్రామాలతోపాటు కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో శుక్రవారం ఆయన పర్యటించి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛను అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇదిలా ఉండగా కోరుకొండ మండలంలో 223 మందికి, సీతానగరంలో 187, రాజానగరంలో 256 మందికి రూ.26.64 లక్షలు ఎన్టీఆర్ భరోసా కింద వితంతు పింఛన్లు అందజేసినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమాల్లో శ్రీరంగపట్నం సర్పంచ్ మద్దాల పెద అమ్మాజీ, మద్దాల రమణ, అడ్డాల శివ, ముక్కా రాంబాబు, బుద్దా బాపూజీ, మళ్ళ అప్పల నర్సారావు, బదిరె డ్డి సత్యనారాయణ మూర్తి, రేపాక సూర్యచంద్రం పాల్గొన్నారు.