ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:05 AM
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శాఖల వారీగా అధికారులకు అందజేసి సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే బత్తు ల బలరామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయ న వివిధ శాఖల అధికారులతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
కోరుకొండలో ప్రజా దర్బార్
150 అర్జీల స్వీకరణ
కోరుకొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శాఖల వారీగా అధికారులకు అందజేసి సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే బత్తు ల బలరామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయ న వివిధ శాఖల అధికారులతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు 150 అర్జీలు అందజేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, భూమి హెచ్చుతగ్గులు, భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఎన్‌ఆర్‌జీఎస్ పను ల్లో సమస్యలపై అర్జీలు అందజేశారు. వాటిలో కొన్నింటిని ఎమ్మెల్యే అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్నింటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలను ఎక్కడిక్కడ పరిష్కరించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. కోరుకొండకు చెందిన ఒక బాలిక మిస్సింగ్ కేసును పరిష్కరించాలని పోలీసులను ఆదేశించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. గుమ్ములూ రులో వైసీపీ పాలనలో దొంగ పట్టాలు ఇచ్చార ని,అర్హులకు కాకుండా భూములు, కార్డులు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ ఫిర్యాదులు అందాయని పేర్కొనారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదే శించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుస్వాగతం, ఎంపీడీవో బత్తిన అశోక్‌కుమార్, ఏడీఏ శశిబిందు, జనసేన నాయకులు అడ్డాల శ్రీను, బదిరెడ్డి దొర, కూటమి నాయకులు పాల్గొన్నారు.