Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:47 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ అన్నారు. మండలంలోని కణుపూరు గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన జనవాణి-ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆయన పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీ కరించారు. ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు, వీధి దీపాలు, రోడ్లు,సాగునీరు, తాగునీరు వంటి సమస్యలపై అర్జీలు సమర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
రాజవరంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బత్తుల

  • ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

  • కణుపూరులో జనవాణి-ప్రజాదర్బార్‌

కోరుకొండ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ అన్నారు. మండలంలోని కణుపూరు గ్రా మంలో శుక్రవారం నిర్వహించిన జనవాణి-ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆయన పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీ కరించారు. ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు, వీధి దీపాలు, రోడ్లు,సాగునీరు, తాగునీరు వంటి సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పీ4 కార్యక్రమంలో ఎలాం టి ఆధారం లేని వారిని గుర్తిం చి వారికి సహాయ సహకారా లు అందించాల్సి ఉందన్నారు.. గ్రామానికి చెందిన దొడ్డి అమ్ములు ఎమ్మెల్యేని కలిసి తాము గ్రామంలో 15 ఏళ్ల నుంచి నివ సిస్తున్నా తమకు రేషన్‌కార్డు గాని ఆధార్‌ కా ర్డులేవని విన్నవించారు. దాంతో ఆ కుటుంబాని కి ఆధార్‌కార్డులు వచ్చేలా చూసి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సీవీఏపీ టీమ్‌ సభ్యులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటేశు లుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయి న రూ.25,166 చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్‌ బత్తు ల వెంకటలక్ష్మి అందజేశారు. ఇదిలా ఉండగా మండలంలోని రాజవరంలో రూ.32 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్న గ్రా మ పంచాయతీ భవన నిర్మాణానికి బత్తుల వెంకటలక్ష్మి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరిలతో కలిసి ఎమ్మెల్యే బత్తుల శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 12:47 AM