Share News

పీజీఆర్‌ఎస్‌తో భరోసా

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:36 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీ ఆర్‌ఎస్‌) నగర ప్రజలకు భరోసా ఇస్తుందని నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌ అన్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 11 అర్జీలను ఆయన స్వీకరించా రు. వీటిలో ఇంజనీరింగ్‌కు సంబంధించి 2, రెవెన్యూ 3, టౌన్‌ ప్లానింగ్‌కు 4, వార్డుసచివాలయం ఒకటి, అడ్మినిస్ట్రేషన్‌కు సబంధించి ఒక అర్జీ వచ్చాయ ని తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌తో భరోసా
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరిస్తున్న అడిషినల్‌ కమిషనర్‌

  • అర్జీలన్నీ పరిష్కారం కావాలి

  • వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

  • అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 18(ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీ ఆర్‌ఎస్‌) నగర ప్రజలకు భరోసా ఇస్తుందని నగరపాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌ అన్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 11 అర్జీలను ఆయన స్వీకరించా రు. వీటిలో ఇంజనీరింగ్‌కు సంబంధించి 2, రెవెన్యూ 3, టౌన్‌ ప్లానింగ్‌కు 4, వార్డుసచివాలయం ఒకటి, అడ్మినిస్ట్రేషన్‌కు సబంధించి ఒక అర్జీ వచ్చాయ ని తెలిపారు. వచ్చిన అర్జీలన్నీ పరిష్కారం కావాలన్నారు. ప్రజలు ఎటు వంటి భయం లేకుండా తమ సమ స్యలను పీజీఆర్‌ఎస్‌లో తెలుపవచ్చని చెప్పారు. నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షా ల కారణంగా పెద్దపెద్ద కాలువలు పొంగి పోర్లుతున్న తరుణంలో వాహనదారులు, పాదచారులు వాటిలో పడిపోకుండా రక్షణగా కాలువల వెంబడి సిమ్మెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. ముఖ్యంగా హైటెక్‌ బస్టాండ్‌, బొగ్గుల దిబ్బ, ఆదె మ్మ దిబ్బ, ఆల్కాట్‌ గార్డెన్స్‌ ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లతో ఉన్న సిమ్మెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి సమయాల్లో కూడా ప్ర మాదాలు సంభవించకుండా నియంత్రించవచ్చన్నారు. అలాగే కాల్వలపై ఆక్రమణలు గుర్తిస్తే తక్షణమే తొలగించాలని ప్లానింగ్‌ సెక్రటరీలను ఆదేశించారు. నగరంలో తాగునీటి పైప్‌లైన్‌ లీకు లు లేకుండా చూడడంతో పాటు క్లోరిన్‌ టెస్ట్‌లు నూరుశాతం నిర్వహించాలని ఎమినిటీ సెక్రటరీలకు సూచించారు. మ్యాన్‌హోల్స్‌కు మూతలు కచ్చితంగా ఉండాలని, లేనిచోట్ల హెచ్చరికల బో ర్డులు ఏర్పాటు చేయాలన్నారు.గోదావరి వరద లు పెరుగుతున్నందన ఆల్కాట్‌ గార్డెన్స్‌, తుమ్మలోవ అంబేడ్కర్‌ భవన్‌, చందా సత్రంలలో పునరావాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమ ణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీ ప్లానర్‌ జి.కోటయ్య, ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 01:36 AM