ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:51 PM
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక లింగంపేట వాంబేకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక లింగంపేట వాంబేకాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ దాంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాంబే గృహాల్లో గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటార్ సక్రమంగా పనిచేయకపోవడంతో స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటారు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. అలాగే కాలనీలోని పలు బ్లాకుల్లో సెప్టిక్ ట్యాంకుల సమస్యకు, డ్రైనేజీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనేక మంది పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డు తదితర సమస్యలు చెబుతున్నారని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి యాళ్ల ప్రదీప్, నగరపాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.