Share News

స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:16 AM

రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం లో ని అన్ని పంచాయతీలను జనసేన కైవశం చేసు కునే దిశగా జనసైనికులు సమష్టిగా పనిచేయా లని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపుని చ్చారు. నియోజకవర్గ జనశ్రేణుల ఆత్మీయ స మావేశం రాజానగరంలోని రాయల్‌ ఫంక్షన్‌ హా ల్లో ఆదివారం జరిగింది.

స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల

  • నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలు గెలవాలి

  • వచ్చే నెలలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీల ఏర్పాటు

  • జనశ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాను న్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం లో ని అన్ని పంచాయతీలను జనసేన కైవశం చేసు కునే దిశగా జనసైనికులు సమష్టిగా పనిచేయా లని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపుని చ్చారు. నియోజకవర్గ జనశ్రేణుల ఆత్మీయ స మావేశం రాజానగరంలోని రాయల్‌ ఫంక్షన్‌ హా ల్లో ఆదివారం జరిగింది. మండల కన్వీనర్‌ వేగి శెట్టి రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల ముఖ్యఅతిథిగా విచ్చే శారు. కూటమి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలన్నారు. వైసీపీ పాలనలో పేకాట, గుండాట, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలు, ఇసుక, కొండలు, చెరువుల్లో మట్టి అక్రమ విక్ర యాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టిం చుకోలేదన్నారు. కూటమి 13 నెలల పాలనలో నియోజకవర్గంలోని 422 కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.3.80 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కు లను అందజేశామన్నారు. జనసేన పార్టీని సం స్థాగతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు రానున్న శ్రావణ మాసంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసు కుందామన్నారు. ఆగస్టు నెలాఖరుకు నియోజక వర్గంలోని 83 గ్రామాల్లోనూ కమిటీలను పూర్తి చేసే యోచన ఉందన్నారు. రానున్న పంచాయ తీ ఎన్నికల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ పద వులు మనమే కైవశం చేసుకునే దిశగా ఇప్పటి నుంచి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో నాసేన కోసం నావంతు కోఆర్డినేటర్‌ బత్తుల వెంటకలక్ష్మి, రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండ లాల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:16 AM