Share News

సీఎం గారు..సమస్యలు తీర్చాలి మీరు!

ABN , Publish Date - Jul 01 , 2025 | 01:08 AM

సీఎం చంద్రబాబుకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి..పరిష్కారం దిశగా ఎదురుచూస్తున్నా యి..

సీఎం గారు..సమస్యలు తీర్చాలి మీరు!

ఇంకనూ అందని టిడ్కో ఇళ్లు

బీసీ రుణాలకు ఎదురుచూపులు

తెలుగు వర్శిటీ అయోమయం

సీఎం చంద్రబాబుకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి..పరిష్కారం దిశగా ఎదురుచూస్తున్నా యి.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో గృహాలు కట్టారు..నేటికీ పేదలకు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. మరో వైపు ఎత్తిపోతల పథకాలదీ అదే పరిస్థితి.. పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకం అయితే 2300 కోట్లతో నిర్మించారు.. కేవలం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతి లేకపోవ డంతో ఆరంభించ కుండానే నిలిచిపోయింది.. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఇలా పలు సమస్యలు సీఎంకు విన్నవిస్తున్నారు.

టిడ్కో ఇళ్లెప్పుడిస్తారు సార్‌..

రాజమహేంద్రవరం/నిడదవోలు/కొవ్వూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం మారినా టిడ్కో ఇళ్ల సమస్య మాత్రం తీరలేదు. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. వాటిని పేదలకు అప్పగించి గృహ ప్రవేశాలు చేయించాలని చంద్రబాబు నాయుడు ఆశించారు.అయితే 2019లో వైసీపీ అధికా రంలోకి వచ్చిన వైసీపీ లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో లబ్ధిదా రుల్లో ఆశలు చిగురించాయి.జిల్లా పరిధిలో రాజమ హేంద్రవరంలో ఏడు ప్రాజెక్టుల కింద 6304 టిడ్కో ఇళ్లు నిర్మించారు. 5,574 మందికి రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయి. ఇంకా 690 మందికి పెండింగ్‌లో ఉన్నాయి.నిడదవోలులో 1755 మంజూరు కాగా 1248 మందిని ఎంపిక చేసి 1152 ఇళ్ల నిర్మాణం చేపట్టారు.ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. కొవ్వూరు పరిధిలో 480 ఇళ్లు ఆరం భించారు. బొమ్మూరులో రెండో దశలో నిర్మించిన 2 వేల ఇళ్లను ఇంకా అప్పగించలేదు. అక్కడ ఎస్‌టీపీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. తొర్రేడులో నిర్మించిన 896 ఇళ్లలో 500 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. ధవళేశ్వరం( వడ్డిర కాలనీ)లో నిర్మించిన 256 ఇళ్లలో 234 అప్పగించారు. మోరంపూడి డిబ్లాక్‌లో 224 ఇళ్లలో 96 లబ్ధిదారులకు అప్ప గించినా కేవలం ఒక్కరు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటు న్నారు.ఇక్కడ మౌలిక సదుపాయాల్లేవు.రెండో దశలో నామ వరంలో 1104 ఇళ్లు,సింహాచల నగర్‌లో 96 ఇళ్లు, బొమ్మూరు ఫేజ్‌-2లో 1200 నిర్మించారు. ఇవి ఇంకా పూర్తి కాలేదు.

జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలి..

కొవ్వూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని జిల్లా ఆసుప్రతిగా అప్‌గ్రేడ్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. కొవ్వూ రు ఆసుపత్రిని కమ్యూనిటి హెల్త్‌ సెంటర్‌ నుంచి 2007లో ఏరియా ఆసుపత్రిగా ప్రకటించారు. అయితే అది ప్రకటనలకే పరిమితమైంది. ప్రభుత్వ ఆసుపత్రి జాతీయ రహదారికి ఆనుకుని ఉండ డంతో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరిగి క్షతగాత్రులు వస్తుంటారు. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి రిఫరల్‌ కేంద్రంగా పేరుగాంచింది. ప్రతి రోజు 250 నుంచి 300 మంది ఆసుపత్రిలో వైద్యసేవలకు కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతు న్నారు. దీంతో సుమారు 6 మండలాలు సుమారు 100 గ్రామా లకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.రాజమహేంద్రవరం జిల్లా ఆసు పత్రి ప్రాంగణాన్ని మెడికల్‌ కళాశాలగా మార్పు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మధ్య భాగంలో ఉన్న కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తెలుగు వర్శిటీకి వీసీ కావలెను?

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల యంను రాజ మహేంద్ర వరంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంత వరకూ వైస్‌ చాన్సలర్‌ను నియమించలేదు. దీంతో గతంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. బొమ్మూరులోని తెలుగు పీఠంలో గతేడాది నుంచి అడ్మిషన్లు ఆగిపోయాయి. దీంతో ఇక్కడ విద్యాపరంగా ప్రగతి లేదు. కేవలం కొద్ది మంది ఉద్యోగులు కాలక్షేపం చేస్తున్నారు. త్వరలో వీసీని నియమించడంతో పాటు మిగతా ఉద్యోగులను నియమించి..ఈ విద్యా సంవత్సరం నుంచే వర్శిటీకి కళ రప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

బీసీ రుణాలు ఇచ్చేనా.

బీసీలకు ఈబీసీలకు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలి స్తానని చెప్పడంతో పాటు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిం దే. జిల్లాలో ఈ ఏడాది 1374 మందికే రుణాలు లక్ష్యం కానీ 16,408 మంది దరఖాస్తు చేశారు.అధికారులు 233 దరఖాస్తులు ఆయా బ్యాంక్‌లకు పంపారు. బ్యాంక్‌లు సుమారు 21 మందికి శాంక్షన్‌ చేశాయి. ఇంతలోను రుణాలివ్వడం ఆగిపోయింది. ఈడబ్ల్యుఎస్‌ కార్పొ రేషన్‌ నుంచి 203 మందికి రుణాలివ్వడం లక్ష్యం కాగా ఏకంగా 2215 మంది దరఖాస్తు చేశారు. బ్యాంకులకు 170 చేరగా బ్యాంకులు ఏడుగురికి రుణాలు మంజూరు చేశాయి. ఆ తర్వాత ఇవన్నీ ఆగిపో యాయి.ఎందువల్ల జాప్యం జరిగిందో తెలియక రుణాల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎదురుచూపులు

రాజమహేంద్రవరం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు గత టీడీపీ హయాంలోనే జరిగాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ఎన్నికలను పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మళ్లీ ఆశలు రేకెత్తాయి. పరిసర ప్రాంతాల గ్రామా లన్నీ కలిపి గ్రేటర్‌ రాజమహేంద్రవరం చేయా లనే ప్రతిపాదన ఉంది. మునిసిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఇటీవల రాజమహేంద్ర వరంలో పర్యటించినప్పుడు జూన్‌లోనే ఎన్ని కలు జరిపిస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఎన్నికల ఊసేలేదు.

మా వైపు చూడండయ్యా!

మధ్యాహ్న భోజన కార్మికుల విన్నపం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 6 వేల వరకూ ఎండీఎం కార్మికులు(ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలు) ప్రతి రోజూ వేలాది మంది పిల్ల లకు మధ్మాహ్న భోజనం వడ్డిస్తున్నారు.బియ్యం ప్రభుత్వం ఇస్తుం డగా నూనె, కూరగాయలు, గ్యాస్‌, దినుసులు, ఉప్పు అన్నీ ఎండీఎం కార్మి కులే కొనుగోలు చేసుకోవాలి. ఇవాళ మార్కెట్లో ధరలతో పోలిస్తే పైసా కూడా మిగలడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.5.80 పైసల చొప్పున చెల్లిస్తుంది. 50 మందికి భోజనం పెడితే రూ.290 వస్తోంది. ఇలా సాధ్యమేనా.. సమంజసమేనా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.దీంతో తమకు గౌరవభృతిగా ఇస్తున్న డబ్బు లు సైతం వంటకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. తమకు కనీసం కూలీ డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కన్నీటి పర్యంత మవుతున్నారు. పిల్లలకు గుడ్లను ఉడికించి వేయించి పెట్టాలని ఆదేశా లిచ్చారు.వేయించడానికి నూనె ఎవరు ఇస్తారో చెప్ప లేదు. రాజ మహేంద్రవరంలోని బ్రాడీపేట, మోరంపూడి ప్రాథమిక స్కూ ల్స్‌లో గుడ్లు వేయిస్తుండగా అవి పేలడంతో మహిళా కార్మికుల చేతులు కాలి పోయాయి. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్నవారే లేరు. కనీసం ఉద్యోగ భద్రత కరువైందని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు దయ తలిస్తే మంగళవారం కొవ్వూరు నియోజకవర్గానికి వస్తున్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. న్యాయపరమైన విన్నపాలను తీర్చాలని వేడుకొంటున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:08 AM