మహిళల ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - May 09 , 2025 | 01:37 AM
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దిపీట వేస్తున్నదని మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.
మండపేట, మే 8(ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దిపీట వేస్తున్నదని మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ద్వార పూడి సచివాలయం1 పరిధిలో గురువారం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళ కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు స్వయంశక్తిపై నిలబడేందుకు కుట్టుశిక్షణ దోహదపడుతుంద న్నారు. మూడునెలలపాటు శిక్షణ అనంతరం వారికి ఉచితంగా కుట్టుమిషన్ ఇస్తామన్నారు. అనంతరం ఎంపీపీ ఉండమట్ల వాసు, ఎంపీడీవో మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జి.వెంకటరమణ, జెడ్.మేడపాడు సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, తాపేశ్వరం సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి, టీడీపీ మండల అధ్యక్షుడు యరగతపు బాబ్జి, మాజీ ఎంఎసీ చైర్మన్ రమేష్‌రాజు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు సత్తి సత్యనారాయణ, జనసేన నాయకులు చింతా దొరబాబు, కె.మురళీకృష్ణ, గోణం పుల్లయ్య, సలాది బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో సత్యనారాయణ మూర్తి, డిప్యూటీ ఎంపీడీవో దాసరి శ్రీనువాస్, ద్వారపూడి, జెడ్.మేడపాడు పంచాయతీ కార్యదర్శులు ఆకులు వీవీ రమణ, వీ.ఆమర్‌నాధ్‌చౌదరి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.