ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:19 AM
అమలాపురం, అక్టోబరు25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు కొరడా ఝులిపించారు. కర్నూలులో బస్సు ప్రమాదఘటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని వివిధ కీలక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 27 బస్సులపై కేసులు నమో
కోనసీమ జిల్లావ్యాప్తంగా వివిధ కీలక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు
27 బస్సులపై కేసులు నమోదు.. ఒకటి సీజ్ : డీటీవో శ్రీనివాస్
అమలాపురం, అక్టోబరు25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులు కొరడా ఝులిపించారు. కర్నూలులో బస్సు ప్రమాదఘటన నేపథ్యంలో అధికారులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని వివిధ కీలక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 27 బస్సులపై కేసులు నమోదుచేయగా, మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సును సీజ్ చేసి ఫిట్‌నెస్ రద్దుచేశారు. ప్రతీవారం నిర్వహించే తనిఖీల్లో భాగంగానే జిల్లాలో ఈ తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల మీ దుగా 60కుపైగా బస్సులు హైదరాబాద్ వెళుతుంటాయి. అయితే కర్నూలు ఘటన తర్వాత కొన్ని బస్సులను ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ముందుగానే నిలిపివేశారు. అయినా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 27 బస్సుల్లో కేసులు నమోదుచేసి 97,600 అపరాధ రుసుముగా విధించామని శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడుపుతున్న ఈ బస్సును సీజ్ చేయడం జరిగిందన్నారు. కాగా జిల్లాలో అన్నంపల్లి, ఈతకోట టోల్‌గేట్‌తోపాటు జొన్నాడ వంటి ప్రాంతాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేయడంతోపాటు సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీటీవో దేవిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోటారు వెహికల్ ఇనస్పెక్టర్లు రవికుమార్, జ్యోతిసురేష్, ఓలేటి శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీశ్రీదేవి, షణ్ముఖశ్రీనివాస్ పాల్గొన్నా రు. బస్సుల్లో వసతులన్నీ తనిఖీ చేశారు.