Share News

ప్రైవేట్‌కు దీటుగా బోధన

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:48 AM

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా బోధించేటట్టు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాల ల్లో శుక్రవారం మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల సమావేశం(పీటీఎం) జరిగింది. ఈ సంద ర్భంగా గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

ప్రైవేట్‌కు దీటుగా బోధన
గోకవరం జూనియర్‌ కళాశాలలో మాట్లాడుతున్న జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ

  • ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

  • జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

  • పలుచోట్ల మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం

గోకవరం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా బోధించేటట్టు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాల ల్లో శుక్రవారం మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యా యుల సమావేశం(పీటీఎం) జరిగింది. ఈ సంద ర్భంగా గోకవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లలు ప్రగతి, వారి నడవడిక, బంగారు భవిష్యత్తుకు ఏం చేస్తే బాగుంటుందని అధ్యాపకులను, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరు స్తున్నారన్నారు. ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా ఏటా డీఎస్సీ నిర్వహించేందుకు కృషి చేస్తున్నారన్నారు. పిల్లలను ప్రవేట్‌ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు అడపా భరత్‌, కన్న బాబు, పిల్లా చంటిబాబు, గాజింగం సత్తిబాబు, ఉంగరాల రాము, దాసరి తమ్మన్నదొర, గళ్లా రాము, మంగరౌతు రాము, ఎస్పీఎస్‌ అప్పలరా జు, కోట సత్యవతి, డీవీఈవో డి.విజయశ్రీ, ప్రిన్సి పాల్‌ కె.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:48 AM