Share News

గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:00 AM

గర్భిణులకు శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.శనివారం అనపర్తి ఏరి యా ఆసుపత్రి ప్రాంగణంలో పరంజ్యోతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీ మంతాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా విచ్చేసి ఆరు పీహెచ్‌సీల పరిధిలోని 50 మంది గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.

గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలి
అనపర్తిలో గర్భిణులకు సీమంతాలు నిర్వహిస్తున్న దృశ్యం

  • ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

  • అనపర్తిలో సామూహిక సీమంతాలు

అనపర్తి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గర్భిణులకు శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.శనివారం అనపర్తి ఏరి యా ఆసుపత్రి ప్రాంగణంలో పరంజ్యోతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీ మంతాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా విచ్చేసి ఆరు పీహెచ్‌సీల పరిధిలోని 50 మంది గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్‌పర్సన్‌ వర్ధినీడి విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ప్ర సంగిస్తూ గర్భం దాల్చిన నాటి నుంచి నెలలు నిండే వరకు కుటుంబీకులు ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోవాలన్నారు.డీసీహెచ్‌ఎస్‌ పద్మ మాట్లాడుతూ పరంజ్యోతి సంస్థ సేవ లను కొనియాడారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోగులకు సే వలందించడంలో వైద్యులు, కమిటీ ప్రతినిధులు శ్రద్ధ చూపాలన్నారు. అలాగే ఆసుపత్రికి అవసరమైన సదుపాయాల కల్పనపై చర్చించారు. ఏపీఐఎస్‌ఐడీసీ ఇంజనీర్‌ రత్నరాజుతో పలు అంశాలపై మాట్లాడారు. ఆసుపత్రి స్థల నిర్ధారణపై గ్రామ పెద్దలు ముందుకు వస్తే ఆసుపత్రిని మరింత అభివృద్ది చేసే కార్యక్రమం చేపడతామన్నారు.

  • ‘క్యాడర్‌ కోసం నల్లమిల్లి’

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘క్యాడర్‌ కోసం నల్లమిల్లి’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి అధికారులు, క్యాడర్‌తో పలు అంశాలపై చర్చించారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుండే క్యాడర్‌ పని చేయాలని సూచించారు. కూటమి నాయకులు గ్రామాల్లో ఏర్పడే చిన్న చిన్న వివాదాలను పరిష్కరిస్తూ క్యాడర్‌ ఐకమత్యానికి కృషి చేయాలన్నారు.

  • జాబ్‌మేళా పోస్టర్‌ ఆవిష్కరణ

ఈనెల 22న అనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో వికాస ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే నల్లమిల్లి వికాస అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేళాలో సు మారు 30 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ యా కార్యక్రమాల్లో సిరసపల్లి నాగేశ్వరరావు, ఏ ఎంసీ చైర్‌పర్సన్‌ జుత్తుక సూర్యకుమారి, కొవ్వూ రి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, ఎన్‌ఆర్‌ కే ప్రసాదరెడ్డి, డీసీ చైర్మన్‌ వెంకటసుబ్బారెడ్డి, కర్రి శేషారత్నం, పోతంశెట్టి సుభాషిణి, రావాడ నాగు, దాకే దుర్గాప్రసాద్‌, అన్నవరం, రాంబాబు, వనుము మల్లేశ్వరి, ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మశ్రీ, డాక్టర్‌ తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 01:00 AM