ప్రసాద్ స్కీం పనులు పూర్తి చేస్తాం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:48 PM
అన్నవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ స్కీం ద్వారా చేపడుతున్న సుమారు రూ.19.32 కోట్లు విలువైన పనులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని టూరిజంశాఖ చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం కాకి నాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో
టూరిజంశాఖ చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరావు
అన్నవరంలో అన్నదాన భవన నిర్మాణ పనుల పరిశీలన
అన్నవరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ స్కీం ద్వారా చేపడుతున్న సుమారు రూ.19.32 కోట్లు విలువైన పనులు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని టూరిజంశాఖ చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం కాకి నాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అన్నదాన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీపడేదిలేదని స్పష్టం చేశా రు. ఈ నిర్మాణాలు పూర్తి అయితే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమం లో టూరిజం శాఖ ఈఈ భాస్కరరావు, దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ తదితరులు ఉన్నారు.