Share News

పోతవరంలో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:46 AM

పి.గన్నవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ ఐదవ వార్షికోత్సవం పుర స్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పోతవరంలో యునైటెట్‌ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ అండ్‌ బెంజ్‌ ప్రెస్‌-2025 పోటీలు జరిగాయి. కోనసీమ పవర్‌ లిప్టింగ్‌ అసోసియేషన్‌ అండ్‌ ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలను శనివారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయమం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. పోటీలకు ఆధ్వర్యం వహించిన ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ నిర్వహకులు కత్తుల శ్రీనివాస్‌ను అభినందించా రు.

పోతవరంలో పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు
విజేతలకు బహమతి, ప్రశంసాపత్రం అందిస్తున్న దృశ్యం

పి.గన్నవరం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ ఐదవ వార్షికోత్సవం పుర స్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పోతవరంలో యునైటెట్‌ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ అండ్‌ బెంజ్‌ ప్రెస్‌-2025 పోటీలు జరిగాయి. కోనసీమ పవర్‌ లిప్టింగ్‌ అసోసియేషన్‌ అండ్‌ ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలను శనివారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం వ్యాయమం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు. పోటీలకు ఆధ్వర్యం వహించిన ఎస్‌ఎస్‌ ఫిట్నెస్‌ జోన్‌ నిర్వహకులు కత్తుల శ్రీనివాస్‌ను అభినందించా రు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కత్తుల శ్రీనివాస్‌ మాట్లా డుతూ అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదా వరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి సుమా రు 150 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్టు వివరించారు. 3 విభాగాల్లో (మహిళలు, మాస్ట ర్స్‌, బాయ్స్‌) మొత్తం 10 కేటగిరిలకు సంబంధి ంచి మెన్‌ 53, 59, 66, 74, 83, 93 కిలోల మాస్టర్స్‌, బాయ్స్‌ విభాగాలు పాల్గొనగా, 63 కిలోల లోపు, ఆపైన కిలోల విభాగాల్లో మహి ళలు పాల్గొన్నారు. మొత్తం 3 కేటగిరిలకు సంబ ంధించి మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలకు గాను 30మందికి విజేతలతో పాటు చాంపియన్‌ ఆఫ్‌ చాంపీయన్‌ విన్నర్‌కు ట్రోఫి, నగదు పుర స్కారాలు, మెరిట్‌ సర్టిఫికెట్‌, మెడల్‌, నేషనల్‌ షీల్డ్‌లను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, కోనసీమ జిల్లా పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యనుమల వెంకట పద్మరాజు, కార్యదర్శి వంటెద్దు వెంకన్ననాయు డు, సంసాని పెద్దిరాజు, తోలేటి సత్తిబాబు, సా ధనాల శ్రీవెంకటసత్యనారాయణ, దైవాల రాంబా బు, యన్నాబత్తుల ఆనంద్‌, చికిలే తరుణ్‌, తోలేటి వంశీకృష్ణ, బొరుసు రాజబాబు, నందుల సన్నీ, తోలేటి రాజా, జిమ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:46 AM