Share News

స్ర్టాంగ్‌మెన్‌గా పవన్‌... స్ర్టాంగ్‌ ఉమెన్‌గా వందన

ABN , Publish Date - May 27 , 2025 | 01:10 AM

అమలాపురం టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌-2025 పోటీలు సోమవారం ముగిశాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సర్‌సీవీ రామన్‌ స్కూలు ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో గెలుపొందిన 24 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక చేసినట్టు అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. హెల్త్‌ అండ్‌ ఫిట్‌

స్ర్టాంగ్‌మెన్‌గా పవన్‌... స్ర్టాంగ్‌ ఉమెన్‌గా వందన
పోటీల్లో స్ర్టాంగ్‌మెన్‌ విన్నర్‌గా నిలిచిన జగన్‌కు షీల్డు అందజేస్తున్న నిర్వాహకులు

అమలాపురంలో ముగిసిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

అమలాపురం టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌-2025 పోటీలు సోమవారం ముగిశాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సర్‌సీవీ రామన్‌ స్కూలు ప్రాంగణంలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో గెలుపొందిన 24 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక చేసినట్టు అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌ కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో కాకినాడ జిల్లా కరప మండలం గొర్రిపూడికి చెందిన ఎం.జగన్‌ స్ర్టాంగ్‌మెన్‌ విన్నర్‌గా నిలవగా రన్నర్‌గా కె.శివకుమార్‌ (కాకినాడ)లు నిలిచి షీల్డులు అందుకున్నారు. స్ర్టాంగ్‌ ఉమెన్‌ విన్నర్‌గా అమలాపురానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి పి.వందన నిలవగా, రన్నర్‌గా రామచంద్రపురానికి చెందిన బి.అఖిల నిలిచారు. స్ర్టాంగ్‌ మాస్టర్‌ విన్నర్‌గా డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామం), రన్నర్‌గా బి.అప్పన్న (అమలాపురం)లు షీల్డులు అందుకున్నారు. పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల టీమ్‌ చాంపియన్‌ షిప్‌ను కాకినాడ దక్కించుకోగా రన్నర్‌గా అమలాపురం జట్టు నిలిచింది. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో గెలుపొందిన 24 మంది క్రీడాకారులను జూన్‌లో ఒంగోలులో జరిగే రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపిక చేశారు. ఆయా పోటీల విజేతలకు నిర్వాహకులు యెనుముల కృష్ణపద్మరాజు, ఆశెట్టి ఆదిబాబు, సూదా గణపతి, రవణం వేణుగోపాల్‌, దొమ్మేటి వెంకటరమణ, చిక్కం రాజబాబు, డాక్టర్‌ కొప్పుల నాగమానస ఫీల్డులు,పతకాలందించారు.

Updated Date - May 27 , 2025 | 01:10 AM