Share News

‘చెత్త’గించారు!

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:15 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.370 కోట్లతో నిర్మించనున్న చెత్త నుంచి విద్యుత్‌ త యారీ ప్రాజెక్టు గాల్లో పడింది. తొలుత ఖరారు చేసిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియో జకవర్గం బలబద్రపురంలో ప్రాజెక్టు రద్దయి పోయింది.

‘చెత్త’గించారు!
రామేశంమెట్ట

రూ.370 కోట్లతో విద్యుత్‌ ప్లాంట్‌

ఎమ్మెల్యే, జనం నుంచి వ్యతిరేకత

మంత్రి నారాయణతోను చర్చ

టెండర్లలో మినహాయింపు

బలభద్రపురంలో ప్రాజెక్టు రద్దు

తాజాగా రామేశంమెట్ట పరిశీలన

నేడు మంత్రి నారాయణ రాక

ఖరారుకానున్న తుది ప్రాంతం

ఊపిరిపీల్చుకున్న ప్రజానీకం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూ.370 కోట్లతో నిర్మించనున్న చెత్త నుంచి విద్యుత్‌ త యారీ ప్రాజెక్టు గాల్లో పడింది. తొలుత ఖరారు చేసిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియో జకవర్గం బలబద్రపురంలో ప్రాజెక్టు రద్దయి పోయింది. బలబద్రపురంలో ఇప్పటికే గ్రాసిం కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడు తున్న నేప థ్యంలో విద్యుత్‌ తయారీ ప్రాజెక్టును స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు మునిసిపల్‌ మంత్రికి ఇప్పటికే తన అభ్యం తరాలు వివరించారు. దీంతో బలబద్రపురంలో ప్రాజెక్టు ఉపసంహరించుకోవాలని అధికారులు నిర్ణయించారు.ఈ ప్రాజెక్టుకు కాకినాడ జిల్లా పె ద్దాపురం పెద్దాపురం రామేశంమెట్ట అనువు గా ఉంటుందని భావిస్తున్నారు.ఎమ్మెల్యే రాజప్ప సైతం ఇక్కడ దీని ఏర్పాటుకు సుముఖంగా ఉ న్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే విద్యుత్‌ త యారీ ప్రాజెక్టు ఏర్పాటుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో మునిసిపల్‌ మంత్రి నా రాయణ,కాకినాడ జిల్లా కలెక్టర్‌ కలిసి నేడో,రేపో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

13 నగరాలు.. వెయ్యి టన్నుల చెత్త

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 ము నిసిపాలిటీలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో 11 కార్పొరేషన్లు, మునిసిపాలి టీలను కలిపి కాకినాడ- రాజమహేంద్రవరం క్లస్ట ర్‌గా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమలో కలిపి రోజుకు 950 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్టు లెక్కలు కట్టింది.అత్యధికంగా ఉమ్మడి తూర్పు పరిధిలోని కాకినాడ కార్పోరేషన్‌లో రోజుకు 144 టన్నులు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ 160, పిఠాపురం 26, పెద్దాపురం 25, సామర్లకోట 23, రామ చంద్రపురం 23, మండపేట 26, ముమ్మిడివరం 11, అమలాపురం 30, నిడదవోలు 22, కొవ్వూరు 26 మునిసిపాలిటీల పరిధిలో దాదాపుగా 30 ట న్నుల చొప్పున చెత్త రోజువారీ వస్తోంది. ఈ చెత్తంటిని ఒక చోటకు చేర్చి రోజుకు 12 మెగా వాట్ల వరకు విద్యుదుత్పత్తి చేయవచ్చని తేల్చా రు.12 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు రూ.370 కోట్ల వరకు ఖర్చవుతుండగా ప్రభుత్వం పైసా పెట్టుబడి పెట్టకుండా ప్రైవేటు కంపెనీ యే భరించేలా ఇటీవల నిర్ణయం తీసుకుంది. చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే కంపెనీయే ఈ మొత్తం భరించేలా టెండర్లు పిలిచింది. ఎంపికైన సంస్థ ఈ మొత్తం భరిస్తే ప్రభుత్వం తరపున చెత్త ఇవ్వడం, ఉత్పత్తయిన విద్యుత్‌ 25 ఏళ్ల పాటు సదరు కంపెనీయే సొంతంగా విక్రయిం చుకునే వెసులుబాటు కల్పించింది.ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి భారం లేకుండా రెం డు కార్పొరేషన్లు, తొమ్మిది మునిసిపాలిటీల్లో చెత్తంతా బయటకు వెళ్లిపోనుంది.

తొలుత బలభద్రపురమే కానీ..

ఈ ప్రాజెక్టుకు అత్యంత అనువైన ప్రాంతంగా మూడు నెలల కిందట అనపర్తి నియోజకవ ర్గాన్ని గుర్తించారు. బిక్కవోలులో 12 ఎకరాలు, బలబద్రపురంలో 20 ఎకరాలను అధికారులు ఎంపిక చేశారు. 12 ఎకరాల్లో విద్యుత్‌ప్లాంట్‌, 20 ఎకరాల్లో తెచ్చిన చెత్తంతా పోగుచేసి విద్యుత్‌ ఉత్పత్తికి అనువుగా మార్చడానికి ప్రాజెక్టును సిద్ధం చేశారు.మంత్రి నారాయణ సైతం స్థలాన్ని పరిశీలించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ల నుంచి చెత్తను తెచ్చి బలబద్రపురంలో స్టాక్‌ చేయడం కోసం అనువుగా ఉందని గుర్తించారు. ఇక్కడ చెత్త నుంచి తయారయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించుకునేందుకు వీలుగా విద్యుత్‌ లైన్‌ ఉండడంతో ప్రాజెక్టు ఇక్కడే అని ఖాయం చేసేశారు. దీనిపై స్థానిక ప్రజల నుంచి, అటు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. చెత్తంతా తెచ్చి ఇక్కడ పోగేస్తే జనం ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుందని..నిత్యం ఊరుచుట్టూ వందల్లో చెత్త లారీలు తిరిగితే జనం నానా ఇబ్బందులు పడ తారని మంత్రి నారాయణ దృష్టికి తీసుకువె ళ్లారు. ఇప్పటికే గ్రాసిం పరిశ్రమ కాలుష్యంతో నరకయాతన పడుతున్న జనానికి ఇది మరో తీవ్ర ముప్పవుతుందని వివరించారు. మరో పక్క చెత్త నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌ తమ ప్రాం తంలో వద్దంటూ బిక్కవోలు, బలబద్రపురం పం చాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

రామేశంమెట్ట వైపు చూపు

ఇటీవల ప్రభుత్వం ఈ తరహా ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది. ఇందులో బలబద్రపురం ప్రాజెక్టును ప్రజావ్యతిరేకత నేపథ్యంలో తప్పించారు. ప్రత్యామ్నాయంగా పెద్దాపురం రామేశం మెట్ట వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది జనావా సాలకు దూరంగా ఉండడం, ఇక్కడ వందలాది ఎకరాల్లో కొండలను తవ్వి గోతులుగా మార్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసినా ఇబ్బంది ఉండదని అధికా రులు భావిస్తున్నారు.ఎమ్మెల్యే రాజప్ప సైతం సుముఖంగా ఉన్నారు.దీంతో ఇక్కడే దాదా పుగా ప్రాజెక్టు ఖాయం అయ్యే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టును కాకినాడ- రాజమహే ంద్ర వరం క్లస్టర్‌ కింద ప్రతిపాదించారు. నేడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారా యణ పెద్దాపురం నియోజకవర్గంలో తొలి అడుగు కార్యక్రమం కోసం వస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్రా జెక్టుకు ఇక్కడ భూములు పరిశీలించనున్నారు.ఆ తర్వాత కలెక్టర్‌తో చర్చించి ఖరారు చేయనున్నారు.

చెత్త కనిపించదంతే..

కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి 11 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో రోజూ భారీగా చెత్త పోగ వుతోంది. నిత్యం ఈ చెత్తంతా మునిసిపల్‌ సిబ్బంది నగరాలు, పట్టణాలకు దూరంగా డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు.ఈ మేరకు వందల కొద్దీ వాహనాలు, ఉద్యోగులు అవసరమవు తున్నారు. ఇలా పోగవుతున్న చెత్తతో డంపింగ్‌యార్డులు చిన్నపాటి కొండలను తల పిస్తున్నాయి. ప్రభుత్వం ఆ చెత్తం టిని ఒక చోటకు తరలించి విద్యుదుత్పత్తిని చేపట్టేలా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. చెత్త నుంచి విద్యుత్‌ తయారీ ప్రాజెక్టు రూ.370 కోట్లతో పట్టాలెక్కించాలని నిర్ణయించింది.

Updated Date - Jul 15 , 2025 | 01:15 AM