Share News

అమలాపురంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌

ABN , Publish Date - May 25 , 2025 | 11:46 PM

అమలాపురం టౌన్‌, మే 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సర్‌సీవీ రామన్‌ పబ్లిక్‌ స్కూలు ఆవరణలో ఆదివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌-2025 పోటీలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రా

అమలాపురంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల  పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌
పోటీలు ప్రారంభించి పవర్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న ఎమ్మెల్యే

ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

అమలాపురం టౌన్‌, మే 25(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సర్‌సీవీ రామన్‌ పబ్లిక్‌ స్కూలు ఆవరణలో ఆదివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌-2025 పోటీలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించడం ఎంతైనా అభినందనీయమని, క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. వివిధ విభాగాల క్రీడా పోటీలను అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబులు ప్రారంభించారు. అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు, జిమ్‌ కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు, బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు, పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యెనుముల కృష్ణపద్మరాజు, మున్సిపల్‌ మాజీచైర్మన్‌ చిక్కాల గణేష్‌, మాజీ కౌన్సిలర్లు జంగా అబ్బాయివెంకన్న, ఆశెట్టి ఆదిబాబు, పెద్దిరాజు రాము, పప్పుల శ్రీరామచంద్రమూర్తి, సూదా గణపతి పాల్గొన్నారు.

విజేతల వివరాలు...

పోటీలు 3 విభాగాల్లో పది కేటగిరీల్లో హోరాహోరీగా జరిగాయి. న్యాయ నిర్ణేతలుగా దొమ్మేటి వెంకటరమణ, డి.లక్ష్మీనారాయణ, డీఆర్కే నాగేశ్వరరావు, జి.వీరభద్రరావు, ఎ.బాలకృష్ణ, చిక్కం రాజబాబు వ్యవహరించారు. ఆయా విభాగాల విజేతలను జిమ్‌ కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పవర్‌లిఫ్టింగ్‌ 53 కిలోల మెన్‌ విభాగంలో వై.వీరబాబు (పి.గన్నవరం) ప్రథమ, జె.జితేంద్రదొర (అమలాపురం) ద్వితీయ, సీహెచ్‌.సంపత్‌ (కాకినాడ) తృతీయ స్థానాలు సాధించారు. 59 కిలోల విభాగంలో వై.రాజు (రాజమహేంద్రవరం), వై.మహేష్‌, పి.సతీష్‌ (కాకినాడ) వరుస స్థానాల్లో నిలిచారు. 66కిలోల విభాగంలో ఎం.జగన్‌ (కాకినాడ), ఎ.దుర్గాప్రసాద్‌ (ద్రాక్షారామం), బి.నానిబాబు (కాకినాడ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. మహిళా విభాగంలో పిల్లి వందన (అమలాపురం) ప్రథమ, బి.అఖిల (రామచంద్రపురం) ద్వితీయ, బి.సింధు (అమలాపురం) తృతీయ స్థానాలు సాధించారు. మాస్టర్స్‌ విభాగంలో బి. అప్పన్న (అమలాపురం) ప్రథమ, డి.నాగేశ్వరరావు (రామచంద్రపురం) ద్వితీయ, ఏఎస్‌.ప్రసాద్‌ (అమలాపురం) తృతీయస్థానాలు సాధించారు.

Updated Date - May 25 , 2025 | 11:46 PM