Share News

ఇందుపల్లిలో ఉమ్మడి జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:46 AM

అమలాపురం రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఇందుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం లంక రాణి ఆధ్వర్యంలో జరి

ఇందుపల్లిలో ఉమ్మడి జిల్లా స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు
పోటీలను ప్రారంభిస్తున్న కోనసీమ జిల్లా డీఈవో సలీంబాషా

అమలాపురం రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా ఇందుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం లంక రాణి ఆధ్వర్యంలో జరిగిన పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా ప్రార ంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక క్రీడా కోటాను అమలుచేస్తుందన్నారు. జాతీయస్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తూ ఉద్యోగ అవకాశాలు దక్కించుకోవాలని సూచించారు. బాలుర, బాలికల విభాగంలో వేర్వేరుగా నిర్వహించిన పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కంకిపాటి వెంకటేశ్వరరావు, మట్టపర్తి వెంకటసముద్రం, జి.గణేష్‌బాబు, యనమదల శ్రీనివాసరావు, షేక్‌ వలీసాహెబ్‌ వ్యవహరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాస్థాయిలో ప్రథమస్థానం సాధించిన పవర్‌ లిఫ్టర్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు సలీంబాషా తెలిపారు.

విజేతలు వీరే..

జిల్లాస్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. 53 కిలోల విభాగంలో సీహెచ్‌ సత్యగోపాల్‌ (ఇందుపల్లి), 59 కిలోల విభాగంలో డి.అనిల్‌ (భీమనపల్లి), 66 కిలోల విభాగంలో ఎంఎన్వీ అవినాష్‌ (సాకుర్రు), 74 కిలోల విభాగంలో జి.దినేష్‌ప్రసాద్‌ (ముక్కామల), 83 కిలోల విభాగంలో ఎం.దుర్గారామగణేష్‌ (అమలాపురం), 93 కిలోల విభాగంలో వై.యశ్వంత్‌సుజిత్‌కుమార్‌ (ముక్కామల), 105 కిలోల విభాగంలో ఎస్కేఎస్‌ఎస్‌ మణికంఠ (శానపల్లిలంక) విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో 43 కిలోల విభాగంలో కె.లక్ష్మీకీర్తన భీమనపల్లి, 47 కిలోల విభాగంలో టి.కీర్తి (రాజోలు), 52 కిలోల విభాగంలో కె.శిరీష (ఇందుపల్లి), 57 కిలోల విభాగంలో యు.షానిక (రాజోలు), 63 కిలోల విభాగంలో పి.స్పందన (రాజోలు), 69 కిలోల విభాగంలో ఎం.సంకీర్తనాదేవి (పాలమూరు), 76 కిలోల విభాగంలో వై.ఇందిర (గొల్లవిల్లి), 84కిలోల విభాగంలో వి.మేఘనశ్రీ (భీమనపల్లి) విజేతలుగా నిలిచారు. వీరికి డీఈవోతో పాటు జిల్లా అధికారి డాక్టర్‌ ఎంఏకే భీమారావు, గుబ్బల పెద్దిరాజు, కామన మధు తదితరులు పతకాలు అందజేశారు.

Updated Date - Nov 20 , 2025 | 12:46 AM