గుంతల్లేని నగరంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:39 AM
రాజమహేంద్రవరంలో రూ 11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణాలు, జంక్షన్ల అభి వృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 4 ( ఆంధ్రజ్యోతి) : రాజమహేంద్రవరంలో రూ 11 కోట్లతో బీటీ రోడ్లు నిర్మాణాలు, జంక్షన్ల అభి వృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం కంబాలచెరువు ఇన్‌కంట్యాక్స్ కార్యాలయం ఎదురుగా నగరపాలక సంస్థ నిర్వహించిన పాట్‌హోల్ ఫ్రీ సిటీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ,కమిషనర్ రాహుల్‌మీనా హాజ రై మాట్లాడారు. నగరంలో 507 పాట్‌హోల్స్‌ను గుర్తించామని వాటిలో ఇప్పటికి 79 పూడ్చామన్నారు. మిగిలిన 428 పాట్‌హోల్ (గుంతలు)పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఎన్ క్యాప్ నిధులు ద్వారా నగరంలో రోడ్లు, జంక్షన్లు అభి వృద్ధి చేస్తామన్నారు. నగరంలో అనాలోచింతంగా గత పాలకులు చేపట్టిన కంబాలచెరువు ఆయకార్ భవన్ ఎదురుగా ఉన్న ఫౌం టైన్లు, సీతంపేట వాటర్ ట్యాంక్‌ల వద్ద ఫౌంటైన్ తొలగిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బం దులు తలెత్తకుండా ఆయా జంక్షన్లు అభివృద్ధి చేస్తామన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగరంలో గుంతలన్నీ పూడ్చి ప్రజలుకు వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్‌కుమార్, మజ్జి రాంబాబు, వై.శ్రీను, దాస్యం ప్రసాద్, బాబి, నాగమణి పాల్గొన్నారు.
దిగజారుడు రాజకీయాలు మానుకోండి
మాజీ ఎంపీ భరత్‌కు ఎమ్మెల్యే సూచన
ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే దానిని తట్టుకోలేక మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపై బురదజల్లేం దుకు మరీ ఇంతలా రాజకీయాలను దిగజార్చేస్తారా అని వైసీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ తీరుపై రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కల్పిత వీడియోలు, ఆడియోలు తీసుకువచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి రాజకీయాలు చేస్తేనే 2024లో ప్రజలు దెబ్బకొట్టారని ఇదే మళ్లీ 2029లో వైసీపీకి చావుదెబ్బ అవుతుందన్నారు. రాజమహేంద్రవరంలో 42 డివిజన్లలో తమ పార్టీ జెండాలు మోసే కార్యకర్తలు తనకు ఎప్పుడు అండగా ఉంటా రన్నారు. నీ బలమేమిటో ఏ వార్డుకు వస్తావో భరత్ రామ్ నువ్వు చెబితే తేల్చుకుందామని సవాల్ చేశారు.