పూడ్చిపెట్టిన మృతదేహం వెలికితీత
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:46 AM
మండపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇప్పనపాడు పంచాయతీ పరిధిలోగల ఎర్రదిబ్బలకాలనీకి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం వైద్యులకు సిఫార్సు చేశా
తండ్రి మృతిపై కుమారుడి అనుమానం
కోనసీమ జిల్లా ఇప్పనపాడులో శవాన్ని పరిశీలించిన పోలీసులు
మండపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇప్పనపాడు పంచాయతీ పరిధిలోగల ఎర్రదిబ్బలకాలనీకి చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టు మార్టం నిమిత్తం వైద్యులకు సిఫార్సు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పనపాడుకి చెం దిన వాకాడ వీర్రాజు(47) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. వీర్రాజు కుమార్తె భర్తతో గొడవల కారణంగా తల్లితం డ్రుల వద్ద ఉంటోంది. ఈనెల 17న వీర్రాజు భార్యతో గొడవపడ్డాడు. ఆ మరుసటి రోజు గుం డెపోటుతో తన భర్త మరణించాడని ఆమె భార్య చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసిం ది. కుమార్తె కూడా వీర్రాజు గుండెపోటుతో మర ణించాడని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహిం చారు. వీర్రాజు కుమారుడు వచ్చిన తర్వాత త న తల్లి ఫోన్‌సంభాషణ విని తండ్రి మరణానికి తల్లి, సోదరే కారణమని అనుమానం కలిగింది. దీంతో మండపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ నేపథ్యంలో సోమవారం శవాన్ని వెలికి తీసి మండపేట రూరల్ సీఐ దొర్రాజు, మండపేట తహశీల్దార్ తేజేశ్వరరావు, పోలీసులు, వైద్యుల సమక్షంలో పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కాని ఏమీ చెప్పబో మని పోలీసులు తెలిపారు. నిద్రిస్తున్న వీర్రాజు ను హత్యచేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్ర యత్నం జరిగిందని కుమారుడు ఆరోపించాడు.