పదో తరగతి విద్యార్థినికి గర్భం.. పాఠశాల కరస్పాండెంట్‌పై పోక్సో కేసు
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:48 AM
రాయవరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని గర్భవతిని చేసిన కరస్పాండెంట్‌పై పోక్సో కేసు నమోదు అయ్యింది. డా
పరారీలో నిందితుడు
కోనసీమ జిల్లా డీఈవో విచారణ
రాయవరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని లోబర్చుకుని గర్భవతిని చేసిన కరస్పాండెంట్‌పై పోక్సో కేసు నమోదు అయ్యింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని ఓ గ్రామంలోని ప్రైవేటు ఫౌండేషన్ స్కూల్ కరస్పాండెంట్ ఎ.షాజీ జయరాజ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. 10వతరగతి బాలికపై కన్నేసి కొన్ని నెలల క్రితం బెదిరించి గర్భవతిని చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఈనెల 28న రాయవరం పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో జ యరాజ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్టు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. ఆ ఫౌండేషన్ స్కూల్‌ను మంగళవారం కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తనిఖీ చేశారు. 8,9,10 తరగతులు అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని డీఈవో ఆరా తీశారు. పాఠశాల యాజమాన్యంపై సమగ్రమైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబ సభ్యులను కలిసి సంఘటనపై ఆరా తీశారు. డీఈవోతో పాటు ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, సీఐ దొరరాజు, ఎస్‌ఐ సురేష్ బాబు, ఐసీడీఎస్ అధికారులు బాలిక కుటుంబ సభ్యులను కలిసి విచారణ జరిపారు. కాగా కరస్పాండెంట్ జయరాజ్ పరారీలో ఉన్నా డు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.