పేదల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:52 AM
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరులో ని 15వ వార్డు బ్రిడ్జిపేట వాంబేకాలనీ, కొవ్వూరు మండలం దొమ్మేరు, మండల కేంద్రం తాళ్లపూడి, చాగల్లు మండలం చాగల్లు, ఊనగట్ల, నందిగం పాడు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
స్మార్ట్ రేషన్ కార్డుతో అక్రమాలకు తావుండదు: ఆర్డీవో
పలుచోట్ల లబ్ధిదారులకు పంపిణీ
కొవ్వూరు/తాళ్లపూడి/చాగల్లు, ఆగస్టు 25(ఆం ధ్రజ్యోతి): పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొవ్వూరులో ని 15వ వార్డు బ్రిడ్జిపేట వాంబేకాలనీ, కొవ్వూరు మండలం దొమ్మేరు, మండల కేంద్రం తాళ్లపూడి, చాగల్లు మండలం చాగల్లు, ఊనగట్ల, నందిగం పాడు గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెలా రే షన్ సరుకులను ఎటువంటి అవకతవకలు లే కుండా పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల పట్టాదారు పాస్‌బుక్, పంట పొలాల సరిహద్దు రాళ్లపై వైసీపీ రంగులు, ఫొటోలు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. దాని లో రూ.2 లక్షల కోట్లు మాత్రమే బటన్ నొక్కారన్నారు.కూటమి ప్రభు త్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. తాళ్ల పూడిలో సర్పంచ్ నక్కా వెంకట అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆర్డీవో రాణీసుస్మిత, ఎమ్మె ల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ము ఖ్య అతిథులుగా విచ్చేసి స్మార్ట్‌రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం లో మాదిరిగా సీఎం ఫొటోలతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతోనే ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు ఉంటాయని అన్నారు. త్వరలోనే రీ సర్వే చేసిన పొలాలకు పాసుపుస్తకాలు అందజేస్తామన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్‌కా ర్డుతో అక్రమాలకు తావుం డదని, రేషన్ పంపిణీపై ఫిర్యాదులు కూడా ఈ కా ర్డు ద్వారా చేయవచ్చని అన్నారు. తహశీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మండలంలో 34 రేషన్ షాపులు ఉన్నాయని, మొ త్తం రేషన్‌కార్డులు 16810 ఉండగా 16667కార్డులను పంపిణీకి సిద్ధం చేశా మన్నారు.కార్యక్రమాల్లో దాయన రామకృష్ణ, సూ రపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, కౌన్సిలర్లు శ్రీనివాస రవీంద్ర, బత్తి నాగరాజు, టీడీపీ మండ లాధ్యక్షుడు వట్టికూటి వెంకటేశ్వరరావు, బోడపాటి ముత్యాలరావు, టి.మోహనరావు, టీడీపీ తాళ్లపూడి మండలాధ్యక్షుడు నామన పరమేశ్వరరా వు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఉప సర్పంచ్ అప్పన జగదీష్, ఎంపీడీవో వేణుగోపాలరెడ్డి, గం టా శివరామకృష్ణ, ఇండుగుల రామకృష్ణ పాల్గొ న్నారు.చాగల్లులో ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, ఆళ్ల హరిబాబు,కేతా సాహెబ్, కరుటూరి సతీష్, తహశీల్దార్ ఎం.మెరికమ్మ పాల్గొన్నారు.