పేదలకు భరోసా కల్పించడమే ధ్యేయం
ABN , Publish Date - Oct 02 , 2025 | 01:27 AM
పేదలకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్ భరో సా పేరుతో పింఛన్ల పం పిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలమూరులో పలువురికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, అక్టోబరు 1( ఆంధ్రజ్యోతి): పేదలకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వం ఎన్టీఆర్ భరో సా పేరుతో పింఛన్ల పం పిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలమూరులో పలువురికి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. రామవరంలో టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.కార్యక్రమాల్లో నాయకులు తేనెల శ్రీనివాస్, చిం తా సురేష్‌రెడ్డి, కర్రి చిన్నారెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం సిటీలో..
స్థానిక 47వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆది రెడ్డి వాసు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించా రు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ప్ర తి కుటుంబానికి భరోసా కల్పించడం తమ బాధ్యత అని, ప్రజారోగ్యం విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, నాయకులు కవులూరి వెంకట్రావు, చిన్ని పాల్గొన్నారు. 50వ డివిజన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, వార్డు ఇన్‌చార్జి మరుకుర్తి రవియాదవ్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వారి వెంట చింతపల్లి నాని, ఎం.చంద్రశేఖర్, యేసు ఉన్నారు.