Share News

కాలిన..కాలుష్యం!

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:32 AM

దీపావళి అంటే సందడే సందడి. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు.ఈ దీపావళి పండగకు ఉమ్మడి జిల్లాలో బాణ సంచా మోతమోగింది.

కాలిన..కాలుష్యం!

హోరెత్తిన బాణసంచా పేలుడు

ప్రమాదకర స్థాయికి చేరిక

అమలాపురాన ఏక్యూఐ 243

రాజమహేంద్రవరంలో 212

కాకినాడ నగరంలో 174

100 దాటితే శ్వాస ఆడదు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

దీపావళి అంటే సందడే సందడి. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు.ఈ దీపావళి పండగకు ఉమ్మడి జిల్లాలో బాణ సంచా మోతమోగింది. జువ్వలు, బాంబులు, చిచ్చుబుడ్లు, లక్ష్మీ టపాసులు పేలాయి. రంగురంగుల మందు గుండు నిప్పులు చిమ్ముతూ పొగలుకక్కాయి. పండగ సంతో షంతో జనం ఎక్కడికక్కడ మందుగుండు భారీగా పేల్చారు. ఒక్కసారిగా పేలిన టపాసులతో గాల్లో కాలుష్యం తీవ్రత పెరి గింది. పొగ నిండిపోయి గాలి నాణ్యత దెబ్బతింది. ముఖ్యంగా సోమవా రం రాత్రి 7 గం టల నుంచి అర్ధరాత్రి 12 గం టల వరకు గాలి నాణ్యతను సూచించే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఏకంగా రెడ్‌సిగ్నల్‌లోకి చేరింది. బాణ సంచావల్ల అత్యధిక కాలుష్యం అమలా పురంలో నమో దైంది.

అమలాపురాన హై...

ఉమ్మడి జిల్లా మొత్తం మీద అమలాపురం పట్టణంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. వాయుకాలుష్యం అత్యధికంగా ఇక్కడే నమోదైంది. పండగరోజు సోమవారం సాయం త్రం ఆరు గంటలకు ఏక్యూఐ 65 నుంచి ఏకంగా 138కి చేరింది. రాత్రి 7 గంటలకు 229, 8 గంటలకు 243, 9 గంటలకు 222, 10 గంటలకు212, 11గంటలకు 198, అర్ధరాత్రి 12గంటలకు 164 నమోదైంది. తిరిగి మంగళ వారం 11గంటల తర్వాత వాయు కాలుష్య తీవ్రత తగ్గిపోయి తిరిగి 56కి చేరింది.

రాజమండ్రిలో ఇలా..

రాజమహేంద్రవరంలోను వాయు కాలుష్యం భారీగా వెదజల్లింది. సోమవారం సాయం త్రం 5 గంటలకు ఏక్యూఐ 82గా నమో దైంది. 6 గంటలకు 121, 7గంటలకు 196, 8 గంటలకు 212, 9గంటలకు 199, 10 గం టలకు 197, 11గంటలకు 198, 12గంటలకు 164 చొప్పున నమోదైంది.మంగళవారం ఉదయం 10గంటల తర్వాత 62కి చేరింది.

కాకినాడలో కాస్త బెటర్‌

కాకినాడ నగరంలో సోమవారం సాయం త్రం 6 గంటలకు ఏక్యూఐ 156 ఉండగా, 7గంటలకు 174, 8గంటలకు 173, 9 గం టలకు 164, 10 గంటలకు167, 11 గం టలకు 166, 12గంట లకు 151 నమోదైంది. అర్ధరాత్రి ఒంటిగంటకు 138, 2గంటలకు 103 నమోదవగా ఉదయం 8 గంటలకు తిరిగి 66కి చేరి గాలి నాణ్యత మెరుగైంది.

స్వచ్ఛమైన గాలి లేదు!

గాలిలో నాణ్యత సూచిక (ఏక్యూఐ) ఆధా రంగా కాలుష్య నియంత్రణ బోర్డు మార్గదర్శకాలు రూ పొందించింది. ఏ క్యూఐ సంఖ్య 50 పాయింట్లలోపు ఉంటే అక్కడ గాలి నాణ్యత బాగుం దని అర్థం. 50 నుంచి 100 వరకు ఉంటే మోడరేట్‌, 100 నుంచి 150 వరకు ఉంటే పూర్‌, 150 నుంచి 200మధ్య ఉంటే అన్‌హెల్తీ వాతా వరణం కింద భావించాలి. పండగ రోజు రాత్రి కాకినాడ,అమలాపురం, రాజమహేంద్రవరంలో వాయుకాలుష్య తీవ్రత పెరిగిపోయింది. ఏక్యూఐ 100 దాటితే ఆస్తమా, కిడ్నీ, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు శ్వాస తీసు కోవడం ఇబ్బందిగా మారుతుంది. ఏక్యూఐ 200 దాటితే శ్వాస సమస్యలు ఎదుర్కొంటారు.ఎందుకంటే మందుగుండు పేలుడుతో వెదజల్లే వాయు కాలుష్యంలో కార్బన్‌ డయాక్సైడ్‌, నైట్రోజెన్‌ డయా క్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ మోతాదు అధికం. దీనివల్ల శ్వాస సమస్యలు వస్తాయి.దీపావళి రోజు రాత్రి ఏకంగా అమలాపురం, రాజ మహేంద్రవరంలో ఏ క్యూఐ 200 పాయింట్లు దాటేసింది.

Updated Date - Oct 22 , 2025 | 01:32 AM