Share News

పోలీస్‌ జాగిలం అర్జున్‌ మృతి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:10 AM

కాకినాడ క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ జాగిలం (స్నిఫర్‌ డాగ్‌) అర్జున్‌ శుక్రవా రం అనారోగ్యంతో మృతి చెందింది. అర్జున్‌ మృతి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ తీ వ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అర్జున్‌కు ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖకు అర్జున్‌ 13 ఏళ్ల పాటు నిబద్ధ

పోలీస్‌ జాగిలం అర్జున్‌ మృతి
అర్జున్‌కు సెల్యూట్‌ చేస్తున్న కాకినాడ ఎస్పీ

కాకినాడ ఎస్పీ తీవ్ర దిగ్ర్భాంతి

కాకినాడ క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ జాగిలం (స్నిఫర్‌ డాగ్‌) అర్జున్‌ శుక్రవా రం అనారోగ్యంతో మృతి చెందింది. అర్జున్‌ మృతి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ తీ వ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అర్జున్‌కు ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖకు అర్జున్‌ 13 ఏళ్ల పాటు నిబద్ధతతో సేవలందించిందన్నారు. గతేడాది మే 17న ఉద్యోగ విరమణ పొంది ందని, అయినా ఇంకా సేవలందిస్తోందన్నారు. యూనిట్‌లో పనిచేసి న కాలమంతా అత్యున్నత నిబద్ధత, అలర్ట్‌నెస్‌, క్రమశిక్షణ ప్రదర్శించిందన్నారు. వివిధ ఆపరేషన్లు, శోధనా కార్యక్రమా ల్లో, ప్రమాద నివారణా విధుల్లో సమర్థవంతం గా పనిచేసిందన్నారు. తన స్నిఫింగ్‌ సామర్థ్యంతో యూనిట్‌ కార్యకలాపాలకు ముఖ్యమైన సహకారం అందించందని, అర్జున్‌ మరణం జిల్లా పోలీస్‌శాఖకు తీరని లోటని తెలిపారు.

Updated Date - Nov 22 , 2025 | 12:10 AM