Share News

ఖైదీ ప్రభాకర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:44 AM

దేవరపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న సెంట్రల్‌ జైల్‌ ఖైదీ బత్తుల ప్రభాకర్‌ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రా జమహేంద్రవరం నుంచి ఖైదీ బత్తుల ప్రభాకర్‌ ను కేసు విచారణ నిమిత్తం

ఖైదీ ప్రభాకర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు
దుద్దుకూరు హైపేపై పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ నరసింహకిషోర్‌

త్వరలో అరెస్టు చేస్తాం

కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌

దేవరపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్న సెంట్రల్‌ జైల్‌ ఖైదీ బత్తుల ప్రభాకర్‌ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రా జమహేంద్రవరం నుంచి ఖైదీ బత్తుల ప్రభాకర్‌ ను కేసు విచారణ నిమిత్తం సోమవారం విజ యవాడ తీసుకెళ్లి ఎస్కార్ట్‌తో రాజ మహేంద్ర వరం వస్తూ రాత్రి దేవరపల్లి మండలం దుద్దు కూరు జాతీయ రహదారి వద్ద ఓ రెస్టారెంట్‌ వద్ద ఆపారు. దీంతో బత్తుల ప్రభాకర్‌ మూత్రం వస్తుందని చెప్పగా కుడిచేతికి ఉన్న సంకెళ్లు తొలగించడంతో ప్రభాకర్‌ పొలాల్లోకి పారిపో యాడు. పోలీసులు వెంబడించినా దొరకలేదు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ విలేకర్లతో సమావేశంలో మాట్లాడుతూ వ్యాన్‌లో ముగ్గు రు ఖైదీలు ఉన్నారని, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బత్తుల ప్రభాకర్‌ కోసం ఏపీ, తెలంగాణలో గాలింపు ముమ్మరం చేశామన్నారు. ప్రభాకర్‌ గతంలో దేవరపల్లి ప్రాంతంలో ఒక స్కూల్‌ వద్ద రూ.3లక్షలు నగదును చోరీ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని ప్ర ముఖ ఇంజనీరింగ్‌ కా లేజీలో రూ.30 లక్షలు చోరీ కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభాకర్‌ను పట్టుకోవడానికి 15 మంది చొప్పున 3ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రోన్‌తో సాంకేతిక పరిజ్ఞానంతో చెక్‌ పోస్టుల ద్వారా జాబ్‌కార్డులతోనూ ముమ్మరంగా దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. ఏలూ రు ఐజీ అశోక్‌ కుమార్‌, తూర్పుగోదావరి జిల్లా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ ఆదేశాలు, సూచ నల మేరకు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యే క బృందాలు ఏర్పాటు చేశామన్నారు. బత్తుల ప్రభాకర్‌ ఏపీ, తెలంగాణలో 66 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. ప్రభాకర్‌ను త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ చెప్పారు.

Updated Date - Sep 24 , 2025 | 12:44 AM