Share News

మిత్రులు.. ముచ్చట్లు!

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:29 AM

కడియం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కడియం జీఎన్‌ఆర్‌ ఏసీ కన్వెన్షన్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ -2009 బ్యాచ్‌ (సివిల్‌ ) పోలీసు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఉదయం నుంచి సాయత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నా

మిత్రులు.. ముచ్చట్లు!

కడియంలో పోలీసు ఉద్యోగుల సమ్మేళనం

కడియం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కడియం జీఎన్‌ఆర్‌ ఏసీ కన్వెన్షన్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ -2009 బ్యాచ్‌ (సివిల్‌ ) పోలీసు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఉదయం నుంచి సాయత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కుటుంబసభ్యుల నేపథ్యం, పిల్లల చదవులు తదితర విషయాలను పంచుకున్నారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, బేగంపేట సీఐ జి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తామంతా 1140 మంది 2009లో ఎస్‌ఐ లుగా శిక్షణ పొందామన్నారు. ఆ నాటి నుంచి ఐకమత్యాన్ని కొనసాగిస్తూ 2014లో రాష్ట్ర విభజన జరిగినా తమ బ్యాచ్‌ అనుబంధం చెక్కు చెదరలేదన్నారు. 2020లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ -2009 (సివిల్‌) వెల్ఫేర్‌ అ సోసియేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. ఏటా డిసె ంబర్‌ 2వ వారంలో అంతా కలుస్తామన్నారు. తమ బ్యాచ్‌ మిత్రుల కుటుంబాలకు ఇప్ప టివరకు రూ.2.20 కోట్లు సాయం అందించామని తెలిపారు. కడియంలో ఆత్మీయ సమ్మేళనానికి కృషి చేసిన కడియం సీఐ అల్లు వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. అనపర్తి సీఐ సుమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 01:29 AM