ఒక్క రోజు తనిఖీ.. 193 బైక్‌ల సీజ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:12 AM
జిల్లాలో అసాంఘిక శక్తుల అణచివేత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు
దాడుల్లో 225 మంది సిబ్బంది
ధ్రువపత్రాల్లేని వాహనాలే టార్గెట్
రాజమహేంద్రవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసాంఘిక శక్తుల అణచివేత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలోని పోలీసులు బృందాలుగా ఏర్పడి అనుమానిత ప్రదేశాలకు తెల్లవారుజామునే చేరుకొని సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 19 దీనిలో భాగంగా మంగళవారం త్రీటౌన్ పరిధిలోని లింగంపేటలో 31, బొమ్మూరు పోలీస్‌స్టేషన్ శాటిలైట్ సిటీ సీ బ్లాక్‌లో 70, ధవళేశ్వరం ఐవోసీఎల్ కాలనీలో 30, గోకవరం డ్రైవర్స్ కాలనీలో 26, కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరమ్మ కాలనీలో 36 బైక్‌లు సీజ్ చేశారు. మొత్తం సరైన ధ్రువపత్రాలు లేని 193 ద్విచక్ర వాహనాలను, గోకవరంలో 5లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఆయా సోదాల్లో ఐదుగురు డీఎస్పీలు, సీఐలు 9, ఎస్‌ఐలు 18, పీఎస్‌ఐలు 7, స్పెషల్ పార్టీలు 2, శక్తి తదితర విభాగాల సిబ్బంది 184 మంది పాల్గొన్నారు. గోకవరం డ్రైవర్స్ కాలనీలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి
జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. సాధారణ జన జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చట్ట ఉల్లంఘనకు ప్రేరేపించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పటిష్టం చేశాం. సోదాల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తు న్నాం. నాటుసారా, గంజాయి, మందుగుండు సామగ్రి, మద్యం అక్రమ నిల్వలను గుర్తించడానికి అణువణువూ నిశితంగా పరిశీలిస్తున్నాం. - ఎస్పీ నరసింహ కిషోర్