మీ సేవలకు వందనం అన్నా.. ఎందుకమ్మా!
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:45 AM
ఏం మతలబు ఉందో తెలియదు కానీ.. ప్రభుత్వం మీ సేవలకు వందనం అంటూ బదిలీ చేసినా ఆమె మాత్రం తన సీటు వదలడం లేదు.
18న మరో ఐఏఎస్ నియామాకం
నేటికి సీటు వదలని స్పెషల్ కలెక్టర్ సరళావందనం
ఇప్పటికీ ఇంట్లోనే పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్
పలు ఆరోపణలతో చర్చనీయాంశం
రాజమహేంద్రవరం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఏం మతలబు ఉందో తెలియదు కానీ.. ప్రభుత్వం మీ సేవలకు వందనం అంటూ బదిలీ చేసినా ఆమె మాత్రం తన సీటు వదలడం లేదు.ఆమె సీట్లోకి మరో అధికారి వచ్చినా ఇంట్లో కూర్చునే ఇప్పటికీ ఫైల్స్ క్లియర్ చేయడం చర్చనీయాం శమ వుతోంది. ఈ విషయమై రకరకాల ఆరోపణలు వినిపిస్తు న్నా యి. రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని ధవళే శ్వరం కేంద్రంగా ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎల్‌ఎఅండ్ ఆర్‌ఆర్ స్పెషల్ కలెక్టర్‌గా ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సత్తెనపల్లి సరళావందనంను ప్రభుత్వం ఈ నెల 17న బదిలీ చేసింది. పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వానికి వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయితే ఆమె మాత్రం రిలీవ్ కాకుండా ఇంట్లోనే కూర్చుని పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తోంది. ఈ నెల 18న ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు (ఎల్‌ఎఅండ్ ఆర్‌ఆర్) అడ్మినిస్ర్టేటర్ వి.అభిషేక్ (ఐఏఎస్)కు అదనపు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే బదిలీ అయిన సరళావందనం ఇంకా రిలీవ్ కాకుండా ఇంట్లోనే ఉండి అనేక ఫైళ్లను క్లియర్ చేస్తుండడం గమ నార్హం. ఫైళ్ల క్లియరెన్స్‌కు కొద్దిరోజుల పాటు ఆమెకు సమయం ఇచ్చి నట్టు ఓ అధికారి చెబుతున్నారు. చాలా కాలంగా పెండింగ్ పెట్టి.. బదిలీ అయిన తర్వాత హడావిడిగా ఇంట్లోనే కూర్చుని పోలవరం భూసేకరణకు సంబంధించిన పైళ్లను క్లియర్ చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. గత జనవరి లోనే ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అవి చాలా కాలం లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరలేదు. ఇటీవల పునరావాస కాలనీల పునర్ని ర్మాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సం గతి తెలిసిందే. ఆమె బదిలీ అయినా ఎందుకు రిలీవ్ కాలే దనేది ప్రశ్నార్థకంగా ఉంది.