Share News

నాడు రివర్స్‌.. నేడు టెండర్స్‌!

ABN , Publish Date - Jul 19 , 2025 | 01:15 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) పనులు సాగుతున్నాయి.

నాడు రివర్స్‌.. నేడు టెండర్స్‌!
పోలవరం ఎడమ కాలువ

గత 17 ఏళ్లుగా సాగదీత

నేటికీ పూర్తికాని పనులు

వైసీపీలో తీవ్ర నిర్లక్ష్యం

పైసా కూడా విదల్చని వైనం

దృష్టి పెట్టిన కూటమి సర్కారు

8 ప్యాకేజీలుగా విభజన

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) పనులు సాగుతున్నాయి. 2008లో ప్రారంభ మైన కాలువ పనులు 17 ఏళ్లయినా నేటికీ సాగుతూనే ఉన్నా యి. భూసేకరణ తదితర సమస్యలు వెన్నాడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పట్టించు కోకపోవడంతో ఐదేళ్లూ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత మళ్లీ పనులకు టెండర్లు పిలిచి దారిలో పెట్టింది. గోదావరి నీటిని విశాఖ ఇండస్ర్టియల్‌, సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో పోల వరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసి) నిర్మిస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడంతో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. అది నేటికీ ఆరంభమే కాలేదు. 2019లో అధికా రంలోకి వచ్చిన వైసీపీ పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకాన్ని కోర్టులో వివాదాస్పదం చేయ డంతో పాటు, ఎడమ ప్రధాన కాలువ పనులు వదిలేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీనిపై మళ్లీ దృష్టి పెట్టింది. 8 ప్యాకేజీలుగా పనులు విభ జించి టెండర్లు పిలిచి పనుల మొదలు పెట్టిం ది. వాస్తవానికి జూన్‌ నెలాఖరుకు కాలువ పనులు పూర్తి చేసి పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం ఎల్‌ ఎంసీలోకి నీటిని పంపి ఏలేరు, విశాఖ అవస రాలకు నీరందివ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. కానీ ప్రస్తుతం భూసేకరణ, ఇతర సమస్యల వ ల్ల ఆలస్యమయ్యే పరిస్థితులున్నాయి.

4 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం..

పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి విశాఖ పట్నం వరకూ 214.808 కిలోమీటర్ల పొడవున ఈ ఎల్‌ఎంసీని నిర్మిస్తున్నారు. 4 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం. తూర్పుగోదావరి జిల్లా రాజా నగరం నియోజకవర్గం పరిధిలో 1.15 లక్షల ఎకరాలు. కాకినాడ జిల్లా పరిధిలో 1.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందివ్వాలి. కాకినాడ నియోజకవర్గంలో 0.42 లక్షలు, జగ్గంపేట నియోజకవర్గంలో 0.0998 లక్షలు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో 0.450 లక్షలు, తుని పరిధిలో 0.240 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడం లక్ష్యం. అనకాపల్లి జిల్లా పరిధిలో 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. ఈ పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యం 17,561 క్యూసెక్కులు.అంటే సెకనుకు ఈ కాలువ నుం చి 17,561 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. కాలువకు పోలవరం ప్రాజెక్టు నుంచి 108.248 టీఎంసీల నీటిని కేటాయిస్తారు. అందులో ఇరిగేషన్‌కు 84.808 టీఎంసీలు, మంచినీరు, పరిశ్రమల అవసరాలకు 23.44 టీఎంసీల నీటి కేటాయింపు అవసరమని అంచనా వేశారు.

రివైజ్డ్‌ అంచనాలతో పనులు..

వాస్తవానికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్‌ఎంసీ) నిర్మాణానికి రూ.1954.74 కోట్లతో జీవో 104ను 2008 మే 30న జారీ చేశా రు.ఆ తరువాత 2016 డిసెంబర్‌ 6న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.3645.24 కోట్ల రి వైజ్డ్‌ అంచనాతో జీవో నంబర్‌ 117 జారీ చేసిం ది. 2019 ఫిబ్రవరి 10న కాలువ పనులు, భూ సేకరణ మొత్తం అంచనాలు వేసి రూ.6205.24 కోట్ల రివైజ్డ్‌ అంచనాతో జీవో 21 జారీ చేసింది. భూసేకరణకు రూ.2002.55 కోట్లు, పనులకు రూ.4202.69 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకూ రూ.2987.44 కోట్ల పనులు పూర్తయ్యా యి. 2024 సెప్టెంబర్‌ 3న జీవో 319 జారీ చేస్తూ పనులను 8 ప్యాకేజీలుగా విభజించా రు.ఈ కాలువలో ఎర్త్‌ వర్కు 12 లక్షల 79 వేల 600 క్యూబిక్‌ మీటర్లు చేయాల్సి ఉంది. లైనింగ్‌ 214.808 కి.మీ 133.446 కి.మీ మేర జరిగింది. స్ట్రక్షర్ల నిర్మాణ పనులు 385 జరగాల్సి ఉండగా 99 పనులు చేపట్టాల్సి ఉన్నాయి. 8 స్ట్రక్షర్లను తొలగించడానికి ప్రతిపాదించారు. భూసేకరణ 10,500 ఎకరాలకు 10,306 ఎకరాలు సేకరిం చారు.ప్యాకేజీ 5 పరిధిలో 11.37 ఎకరాలు, ప్యా కేజి 7 పరిధిలో 9.485 ఎకరాలు సేకరించాల్సి ఉంది.భూసేకరణకు ఇప్పటి వరకూ రూ.530. 04 కోట్లు ఖర్చు చేశారు.పాత ఏజెన్సీలను రద్దు చేసి కొత్త ఏజెన్సీలకు పనులిచ్చారు.8 ప్యాకే జీ ల్లో చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 19 , 2025 | 01:15 AM