Share News

హౌ..ష్‌!

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:25 AM

ఉమ్మడి జిల్లాలో పేదల సొంతింటి కల సాకారం అవడం లేదు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా అనుమతులు రావడం లేదు. ఒక పక్క వీరి అర్హతను ధ్రువీకరిస్తూ గృహ నిర్మాణ శాఖ పచ్చజెండా ఊపినా కేంద్రం అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

హౌ..ష్‌!

పీఎంఏవైకు ఎదురుచూపులు

దరఖాస్తులు చేసి 8 నెలలు

ఇంకనూ రాని అనుమతులు

44,700 మంది దరఖాస్తు

గృహనిర్మాణ శాఖ సర్వే పూర్తి

95 శాతం అర్హులుగా గుర్తింపు

నమోదు కాని వివరాలు

లాగిన్‌లు కేటాయించని కేంద్రం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో పేదల సొంతింటి కల సాకారం అవడం లేదు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా అనుమతులు రావడం లేదు. ఒక పక్క వీరి అర్హతను ధ్రువీకరిస్తూ గృహ నిర్మాణ శాఖ పచ్చజెండా ఊపినా కేంద్రం అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసినా వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి కేంద్రం కావాల్సిన లాగిన్‌లు పూర్తిగా ఇవ్వడం లేదు. దీంతో సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మిం చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందో స్పష్టత లేదు. అధికారు లేమో అర్హులైన లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నా కేంద్రం ఆమోదం లేక తిరస్కారానికి గురవుతున్నాయి.గత వైసీపీ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ఎడాపెడా లెక్కలు చూప డంతో అనుమానాలతో తాజా లబ్ధిదారులను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడానికి సాంకేతిక ఇబ్బందులు అడ్డువస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 44,700 మంది పేదలు దీనంగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే నిధు లు విడుదల ఖాయమని భావించి పనులు చేసేసి బిల్లులు అందక లబోదిబోమంటున్నారు.

గాలి లెక్కలతో అస్తవ్యస్తం

కేంద్రం పీఎం అవాస్‌ యోజన 2.0 కింద ఉమ్మడి జిల్లాలో సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. కేంద్రం లాగిన్‌లలో లబ్ధిదారుల వివరాలు అప్‌ లోడ్‌ చేస్తేనే ఇది సాధ్యం. కేంద్రం లాగిన్‌లు ఇవ్వకపోవడానికి గత వైసీపీ హయాంలో జరి గిన అడ్డదిడ్డ నిర్ణయాలే కారణమని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో గొప్పల కోసం కట్టని ఇళ్లను సైతం జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో కేం ద్రానికి దొంగ లెక్కలు చూపించేశారు. తద్వారా నిధులు రాబట్టేశారు.ఎక్కడో ఊరి చివర, శ్మశా నాల వద్ద ఖాళీ స్థలాల్లో పేదలకు భూములి చ్చారు. ఇవన్నీ ముంపు ప్రాంతాలు, ఊళ్లకు దూరంగా ఉండడంతో లబ్ధిదారులు అసలు ఇళ్లు కట్టలేదు. ఇవి పూర్తకపోవడంతో కేంద్రం సీరి యస్‌గా ఉంది.ఈ నేపథ్యంలో తాజా లబ్ధిదా రులకు చిక్కులు తలెత్తాయి. పాతవి పూర్తికాక పోవడం,నిధులు లాగేయడంతో ఇప్పుడు కేంద్రం కొత్త లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోకుండా లాగిన్‌లు ఇవ్వడం మానేసింది. అప్పటి జగన్‌ ప్రభుత్వ నిర్వాకం ఇప్పుడు అసలు సిసలు పేద ల కొంపముంచింది. డిమాండ్‌ సర్వే పూర్తవ డంతో పథకానికి అర్హత వచ్చేసిందన్న ధీమాతో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అనేకమంది పేదలు పునాదులు,శ్లాబ్‌స్థాయి వరకు నిర్మాణాలు చేసే శారు.తీరా బిల్లులు కాదుకదా..కేంద్రం లాగిన్‌లు ఇవ్వకపోవడంతో తలలుపట్టుకుంటున్నారు.

44,700 దరఖాస్తులు..

పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి అధి కారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సొంత స్థలం ఉన్న పేద లకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీని నెర వేర్చ డానికి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు కేంద్రం,రాష్ట్రం కలిపి రూ.2.50 లక్షలు ఇస్తామని ప్రకటించింది.ఈ మేరకు సచివా ల యాల ద్వారా గతేడాది నవంబరు ఆఖరు నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పటి వర కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44,700 మం ది దరఖాస్తులు చేసుకున్నారు.అత్యధికంగా కాకి నాడ జిల్లాలో 18,500 దరఖాస్తులు, తూర్పు గోదావరి జిల్లాలో 12,200, డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 14 వేల దర ఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు అర్హుల కోసం గ్రామాల వారీగా డిమాండ్‌ సర్వే నిర్వహించగా 95 శాతం మందికిపైగా అర్హత సాధించారు. వివిధ దశల వడపోత అనంతరం రాష్ట్ర ప్రభు త్వ గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారుల యాప్‌లో వివరాలు నమోదు చేశారు.

స్పందించని కేంద్రం

లబ్ధిదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వ హౌసింగ్‌ వెబ్‌సైట్‌లో పట్టణం, గ్రామీణ ప్రాం తం విభాగంలో అప్‌లోడ్‌ చేయాలి. లబ్ధిదారుడి ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తే అర్హత సాధించిన ఒక్కో లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షలు,రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష మంజూరు చేయాలి. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున లబ్ధిదా రులకు రూ.లక్ష చొప్పున ఇవ్వడానికి ఏ ఇబ్బందీ లేకపోయినా కేంద్రం నుంచే సమస్య తలెత్తింది. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలు అధికారులు కేంద్ర ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో నమోదు చేయాలి. ఇలా చేయాలంటే గ్రామాల వారీగా ప్రత్యేకంగా కేటాయించిన లాగిన్‌లను ఉపయోగించి పథకానికి అర్హత సాధించిన వారి వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం అసలు లాగిన్‌లే ఇవ్వలేదు.దీంతో ఎంపికైన లబ్ధిదారుల వివరాలు జిల్లా అధికారుల వద్దే ఉండిపోయాయి.కాకినాడ జిల్లాలో 326 గ్రామాలకు లాగిన్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 106 గ్రామాలకే లాగిన్‌లు ఇచ్చారు.వీటి ద్వారా లబ్ధిదారుల వివరాలు అప్‌ లోడ్‌ చేస్తే కేవలం 1800 దరఖాస్తులు మాత్రమే కేంద్ర వెబ్‌సైట్‌ స్వీకరించింది. కోన సీమ జిల్లాలో 286 గ్రామాలకు 47 గ్రామాలకే లాగిన్‌లు ఇవ్వగా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేస్తుంటే స్వీకరించడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో 303 గ్రామాలు ఉంటే 55 గ్రామాలకు కూడా లాగిన్‌లు కేటాయించలేదు. దీంతో లబ్ధి దారులకు ఇప్పట్లో కేంద్రం నుంచి ఇళ్ల నిర్మాణ అనుమతులు వచ్చేలా కనిపించడం లేదు.

Updated Date - Aug 11 , 2025 | 12:25 AM