Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ

ABN , Publish Date - Jun 07 , 2025 | 01:23 AM

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది.

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

  • జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 6(ఆంధ్ర జ్యోతి): రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించే క్రమం లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. భవిష్యత్‌లో అటువంటి ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదే శించారు. ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అం దుకు జాయింట్‌ కమిటీ ఆధ్వర్యం లో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయా లని స్పష్టం చేశారు. రహదారులు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టే సందర్భంలో స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసిజర్‌కు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు జరిగే ప్రాంతానికి 500 మీటర్ల దూరం నుంచి సూచికలు, తగిన డైవర్షన్‌లు పెట్టడం, వేగ నియంత్రణ కోసం బోర్డులు ప్రదర్శన చేయాలన్నారు. జాతీ య రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగకుండా తగిన లైటింగ్‌ వ్యవస్థ, బ్లింకర్స్‌ ఏర్పా టు చేసి చోదకులను అప్రమత్తం చేయడం ముఖ్యమన్నారు. సైన్‌బోర్డులతో పాటు డైవర్షన్‌ పెట్టడం వలన వేగ నియంత్రణ ప్రమాధనివారణ సాధ్యమౌతుందన్నారు. ఎస్పీ మాట్లాడు తూ జిల్లా పరిధిలో నల్లజర్ల పరిధి అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేశంగా గుర్తించామన్నారు. జిల్లాలో జరిగిన ప్రతీ ప్రమాద ఘటనపై శాఖల వారీగా విశ్లేషణ చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జిల్లా ఆర్‌అండ్‌బి అధికారి ఎస్‌బీవీ రెడ్డి, జిల్లా రవాణాధికారి ఆర్‌.సురేష్‌, పోలీస్‌, ఎన్‌హెచ్‌, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 01:23 AM