Share News

ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:53 AM

రాజమహేంద్రవరంలో ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని ము నిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌మీనా ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్‌ పరిధిలోని సీతంపేట, గాదాలమ్మనగర్‌ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు
నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌

  • మునిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా

  • నగరంలో నూతన భవనాల తనిఖీ

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 25( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని ము నిసిపల్‌ కమిషనర్‌ రాహుల్‌మీనా ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్‌ పరిధిలోని సీతంపేట, గాదాలమ్మనగర్‌ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వివిధ భవనాల అసెస్మెంట్‌ డిమాండ్లతో కొలతలను పరిశీలించామని, బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత ప్లాన్‌ ప్రకారం నిర్మిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేస్తామని స్పష్టం చేశారు.ప్లాన్లకు వి రుద్ధంగా ఉన్న భవనాలకు నోటీసులు జారీ చేయాలన్నారు.కమిషనర్‌ వెంట డిప్యూటీ సిటీప్లా నర్‌ నాయుడు, పి.శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 12:53 AM