పాదగయలో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:19 AM
పిఠాపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి పేర్లతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 5 బ్యాచ్‌లుగా వ్రతాలు జరిపించారు. దత్తాత్రేయ మం
మహిళలకు పవన్ పంపిన 14వేల చీరల అందజేత
పిఠాపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి పేర్లతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 5 బ్యాచ్‌లుగా వ్రతాలు జరిపించారు. దత్తాత్రేయ మండపం, సరస్వతీదేవి మందిరం సహా ఆలయ ప్రాం గణంలో మహిళలు వ్రతాలు ఆచరించారు. వేదపండితులు, ఘనాపాఠీల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా శ్రావణ లక్ష్మికి పూజలు జరిగాయి. భక్తులకు కొబ్బరికాయ, గాజులు, పసుపు, కుంకు మ, అరటి పళ్లు, పువ్వులు, పూజా సామగ్రి, చీర, రవిక, వరలక్ష్మి రూపు, ప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశారు. క్షేత్రంలో వస్తున్న సంప్రదాయం, అనవాయితీకి అనుగుణంగా చీరలు, పసుపు, కుంకుమ, గాజులను ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ సమకూర్చారు. 14వేల చీరలను పవన్ సమకూర్చారు. వీటిని భక్తులకు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగమణి సతీమణి కొణిదెల పద్మజ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు అందజేశారు. మహిళలతో పాటు పద్మజ వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.