గ్రహణం వేళ తెరిచి ఉన్న పాదగయ
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:46 AM
పిఠాపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం తెరిచే ఉంది. గ్రహణ సమయం
కుక్కుటేశునికి అభిషేకాలు
పిఠాపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం తెరిచే ఉంది. గ్రహణ సమయంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా పాదగయతో పాటు శ్రీకాళహస్తి ఆలయాలు మాత్రమే తెరిచి ఉంటా యి. ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా గ్రహణ సమయంలో కుక్కుటేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులు పాదగయ పుష్కరిణిలో పట్టువిడుపు స్నానాలు ఆచరించారు. పాదగయలోని కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు అన్ని ఆలయా లు తెరిచే ఉన్నాయి. పూజల్లో ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తదితరులున్నారు.